BIKKI NEWS (OCT. 29) : RISING TELANGANA CITIZEN SURVEY PROGRAMME. తెలంగాణ రైజింగ్ విజన్-2047 సర్వేలో పౌరులందరూ పాల్గోనేలా సిటిజన్ సర్వే చేపట్టారు. ఇప్పటికే ఈ సర్వే ప్రారంభమైంది. తెలంగాణలోని ప్రతి పౌరుడు, ఉద్యోగి తప్పనిసరిగా సర్వేలో పాల్గొని… సలహాలు, సూచనలు అందించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం సర్క్యులర్ జారీ చేసింది.
RISING TELANGANA CITIZEN SURVEY PROGRAMME
నవంబర్ 01 వరకు జరిగే సర్వేలో అందరూ పాల్గొనడంతో పాటు.. సర్వే లింక్‌ను, క్యూఆర్ కోడ్‌ను ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రదర్శించాలని, విస్తృత ప్రచారం నిర్వహించాలని సీఎస్ కె.రామకృష్ణారావు సర్క్యులర్‌లో ఆదేశించారు.
కింద ఇవ్వబడిన లింకు ద్వారా పౌరులు సర్వేలో పాల్గొనండి
2047 నాటికి తెలంగాణ ఎలా ఉండాలని కోరుకుంటున్నారనే కోణంలో పౌరులు వివిధ అంశాలపై తమ ఆలోచనలు, సూచనలను సర్వేలో పొందుపర్చాల్సి ఉంటుంది. అందులోని ముఖ్యాంశాలిలా.
తెలంగాణ ఆర్థిక వృద్ధిని 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్లకు చేర్చడంలో భాగంగా.. ఉద్యోగావకాశాలు కల్పించడానికి నిర్వహించాల్సిన కోర్సులు, ఔత్సాహిక స్టార్టప్‌లకు ప్రోత్సాహకాలు
వ్యవసాయ అనుబంధరంగాల్లో నూతన ఆవిష్కరణలు
స్థానిక సంస్థల బలోపేతానికి అవసరమైన నిధులు, అధికారాలు… సమీప ప్రాంతాల అభివృద్ధికి చేపట్టాల్సిన పనులు.
పారిశ్రామికాభివృద్ధికి ప్రణాళికలు, చేపట్టాల్సిన సంస్కరణలు.
పౌర సేవలను ఒకే పోర్టల్ కిందకు తీసుకొచ్చేలా కార్యాచరణ ప్రణాళిక
మండలానికో ఆసుపత్రి, సంచార వాహనాలు, టెలి వైద్యవిధానం, పారిశుద్ధ్యం, తక్కువ ధరల్లో ఔషధాల లభ్యత, ఆరోగ్య బీమా
.
ఏఐ, రోబోటిక్స్, ఐటీఐలో నైపుణ్య ఆధారిత కోర్సులు, అంతర్జాతీయస్థాయి విశ్వవిద్యాలయాలను నెలకొల్పడం
గ్రామీణప్రాంతాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన
గిరిజన, మారుమూల ప్రాంతాల్లో అందించాల్సిన అధునాతన సేవలు
వ్యవసాయ, అనుబంధ రంగాల అభివృద్ధికి ప్రణాళికలు
ఫార్మా, బయో సైన్స్ రంగాల్లో పరిశోధనలు, ఆవిష్కరణలు, అంతరిక్షం, రక్షణ రంగాల్లో అభివృద్ధికి ప్రణాళికలు తదితర అంశాలు.
RISING TELANGANA SURVEY LINK

