RENEWAL – ఇంటర్ విద్యలో వివిధ పోస్టుల రెన్యువల్ కు ప్రతిపాదనలు.

BIKKI NEWS (AUG. 20) : Renewal of contract and guest jobs in intermediate education. తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యలో వివిధ కేటగిరీలలో 970 పోస్టులను 2025 – 26 విద్యా సంవత్సరం కోసం రెన్యువల్ కు సంబంధించి వివరాలు ఇవ్వాలని ఉన్నత విద్యాశాఖ ఇంటర్ డైరెక్టర్ ను కోరింది.

Renewal of contract and guest jobs in intermediate education

ఈ పోస్టులలో కాంట్రాక్ట్ పోస్టులు 420, గెస్ట్ పోస్టులు 398, పార్ట్ టైం హవర్లీ బేసిస్ 51, పార్ట్ టైం కాన్సలిడేటెడ్ 42, ఔట్ సోర్సింగ్ – 56, మినిమం టైం స్కేల్ – 03 పోస్టులు కలవు.

వీరి రెన్యువల్ ఏప్రిల్ 01 – 2025 నుండి మార్చి 31 – 2026 వరకు చేయనున్నారు.

ఇంటర్మీడియట్ బోర్డ్ నుంచి తుది వివరాలు పంపిన తర్వాత, ఉన్నత విద్యాశాఖ రెన్యువల్ జీవో విడుదల చేయనున్నది.