Praja vaani - రెవిన్యూ డివిజన్ స్థాయిలో ప్రజావాణి - సీఎం - bikki news

Praja vaani – రెవిన్యూ డివిజన్ స్థాయిలో ప్రజావాణి – సీఎం

BIKKI NEWS (MAR. 26) : PRAJA VAANI AT REVENUE DIVISION LEVEL. ప్రజా సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని రెవెన్యూ డివిజన్ స్థాయిలో కూడా నిర్వహించడానికి సంబంధించి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు.

PRAJA VAANI AT REVENUE DIVISION LEVEL

శాసనమండలి సమావేశ హాలులో ముఖ్యమంత్రి గారితో ప్రముఖ సామాజిక కార్యకర్త నిఖిల్ డే గారి నేతృత్వంలోని ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా భేటీ అయింది. ప్రజా సమస్యల పరిష్కారానికి అనుసరిస్తున్న విధానాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను ఈ సందర్భంగా నిఖిల్ డే గారు ప్రశంసించారు.

తెలంగాణలో ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో చేపడుతున్న ప్రజావాణి కార్యక్రమాన్ని రెవెన్యూ డివిజన్ స్థాయికి తీసుకెళ్లడంపై ఈ సమావేశంలో చర్చించారు. అందుకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించారు.

రాజస్థాన్ ప్రభుత్వం చేపడుతున్న “జన్ సూచన పోర్టల్” తరహాలో తెలంగాణలోనూ ‘ప్రజా సూచన పోర్టల్ ‘ ఏర్పాటు చేయాలని చర్చ జరిగింది.

వివిధ శాఖల ఆధ్వర్యంలో ప్రభుత్వం చేపడుతున్న అన్ని పథకాలకు సంబంధించిన వివరాలను ఒకే చోట అందుబాటులో ఉండే విధంగా ఈ పోర్టల్​ రూపొందించనున్నారు. ఐటీ శాఖ ఆధ్వర్యంలో ఈ పోర్టల్‌ను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు.

తెలంగాణ గిగ్ వర్కర్స్ బిల్‌ను ఈ సందర్భంగా నిఖిల్ డే గారు ప్రశంసించారు. ఈ చట్టం దేశంలోనే చారిత్రాత్మకంగా నిలుస్తుందని అన్నారు.

ఈ సమావేశంలో తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి గారు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు గారితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →