ప్రభుత్వ కళాశాలలోనే విలువలతో కూడిన విద్య లభిస్తుంది - bikki news

ప్రభుత్వ కళాశాలలోనే విలువలతో కూడిన విద్య లభిస్తుంది

  • BIKKI NEWS : 23-01-2026

  • వైరా ఎమ్మెల్యే మాలోతు రామదాసు నాయక్ గారు
  • వైరా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 18 అదనపు తరగతుల నిర్మాణానికి భూమి పూజ

Parent teacher meeting in GJC WYRA. ప్రభుత్వ కళాశాలలోనే విలువలతో కూడిన విద్య లభిస్తుందని వైరా ఎమ్మెల్యే శ్రీ మాలోతు రామదాసు నాయక్ గారు తెలిపారు. ఈరోజు వైరా పట్టణంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మూడు కోట్ల రూపాయలు నిధులతో అదనపు తరగతి గదుల నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగింది

Parent teacher meeting in GJC WYRA

అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి నవీన జ్యోతి ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో ముఖ్య అతిథిగా మాట్లాడుతూ ఒకవైపు విలువలతో కూడిన విద్య ఒకవైపు లక్షలతో కూడిన విద్య ఒకవైపు ఉంటుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ కళాశాల అభివృద్ధికి గౌరవ ముఖ్యమంత్రి విద్యా శాఖ మంత్రి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారు చాలా ప్రాముఖ్యత ఇస్తున్నారని తెలుపుతూ విలువలతో కూడిన విద్య కావటానికి ప్రభుత్వ కళాశాలలో చదవాలని కోరారు. వైరా ప్రభుత్వ జూనియర్ కళాశాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలుపుతూ అవసరమైతే విద్యార్థులకు కావలసిన హాస్టల్ సౌకర్యం గురించి గౌరవ ఉపముఖ్యమంత్రులు మరియు ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళుతున్న హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా పేరెంట్స్ కమిటీ మీటింగ్ లో గతంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివి సత్య మూడో సంవత్సరం మెడికల్ విద్యార్థి , ఇన్ఫోసిస్ లో పనిచేస్తున్న అమీర్, సింగరేణి కాలరీస్ లో పనిచేస్తున్న నాగరాజు మరియు 2024 లో డీఎస్సీలో టీచర్ ఉద్యోగం సంపాదించిన రామారావు, మరియు సింగరేణిలో ఉన్నత ఉద్యోగం చేస్తున్న కాళీ మదు, వైరాలో స్వయం ఉపాధి ద్వారా మెటల్ హోల్ సేల్ షాప్ నిర్వహిస్తు పదిమంది నిరుద్యోగులు ఉపాధి కల్పిస్తున్న సాయి కృష్ణ, మోహన్ కృష్ణను ఘనంగా సన్మానించడం జరిగింది.

ఈ సందర్భంగా గత సంవత్సరం మొదటి సంవత్సరంలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ఎమ్మెల్యే గారి చేత కళాశాల తరఫున ప్రొత్సహకాలు అందజేయడం జరిగింది‌.

ఖమ్మం జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ రవి బాబు గారి అతిథిగా పాల్గొంటూ ప్రభుత్వం చేపడుతున్న విద్యాభివృద్ధి కార్యక్రమాలను ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ వైరా ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు అడ్మిషన్ పెరగటానికి అందరూ కలిసి కృషి చేయాలని కోరారు.

సక్సెస్ విద్యార్థుల స్టోరీస్ ను విద్యార్థుల ఆసక్తిగా విన్నారు. అనంతరం కళాశాల తరపున ప్రిన్సిపాల్ మరియు స్టాపు విద్యార్థులు గౌరవ ఎమ్మెల్యే గారిని ఘనంగా సన్మానించడం జరిగింది. జాతీయ ఓటర్ల దినోత్సవం ఈనెల 25 సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశానుసారం ఓటర్ల ప్రతిజ్ఞ సభికులు చేత చేపించడం జరిగింది.

Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →