BIKKI NEWS (SEP. 24) : NSS day celebrations in GJC boys Husnabad. ఎన్ఎస్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఎన్ఎస్ఎస్ చైర్మన్ మరియు ప్రిన్సిపాల్ చెన్నూరి గంగాధర్. సామాజిక సేవలో విద్యార్థులను భాగస్వాములుగా తీర్చిదిద్ది వారి వ్యక్తిత్వ వికాసానికి కృషి చేయడంలో ఎన్ఎస్ఎస్ పాత్ర కీలకం అన్నారు.
NSS day celebrations in GJC boys Husnabad
గురువారం హుస్నాబాద్ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్ఎస్ఎస్ ఆవిర్భావ వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… “విద్యార్థి లోకాన్ని నిరాశ నిస్సృహాలకు లోను కాకుండా, అనవసరమైన ఆవేశాలకు పోకుండా, హింస మార్గం వైపు వెళ్లకుండా అడ్డుకట్ట వేయడానికి మరియు విద్యార్థుల్లో సేవాభావాన్ని పెంపొందించడానికి 1969లో ఎన్ఎస్ఎస్ ఆవిర్భవించింది అని ఆయన పేర్కొన్నారు. విద్యార్థి దశలోనే సేవా భావన్నీ అలవర్చుకోవడం ఎంతో ఉత్తమమని అన్నారు. నా కోసం కాదు- మీకోసం అనే ధ్యేయ వాక్యం మార్గదర్శకం అని పేర్కొన్నారు. దేశం కోసం, సమాజం కోసం, మన గ్రామం కోసం, మన కళాశాల కోసం చేయగలిగినంత సేవాభావం ప్రతి వాలంటీర్ లో ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. పరిశుభ్రమైన వాతావరణాన్ని నిర్మించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. పచ్చదనం భవిష్య తరాలకు మనం ఇచ్చే బహుమతి అని, ఒక మొక్కను నాటడం అంటే భవిష్యత్ తరాలకు ఒక ప్రాణ వాయువును అందించడం అని ఆయన పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి కనీసం ఒక మొక్కను నాటి దాన్ని తన బాధ్యతగా తీసుకొని పెంచితే ఎన్ఎస్ఎస్ ఆవిర్భావ దినోత్సవం యొక్క నిజమైన స్ఫూర్తి నెరవేరుతుందని అన్నారు. కళాశాల నుండి బయటకు వెళ్లిన తర్వాత కూడా సమాజానికి నేను ఏమి చేయగలను అనే ఆలోచన ప్రతి విద్యార్థులో ఉండాలని ఆయన పిలుపునిచ్చారు”.
ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి తిరునహరి రణధీర్ కుమార్ మాట్లాడుతూ…“హృదయంలో సేవా భావం ఉంటే సమాజంలో మార్పులు తీసుకురావచ్చని వాలంటీర్లను ఉద్దేశించి మాట్లాడారు మన చేతులు కలిస్తే మానవహారం అదేవిధంగా మనమంతా కలిస్తే ఒక శక్తివంతమైన సమాజం ఏర్పడుతుందని అన్నారు.”
అనంతరం విద్యార్థులు, వాలంటీర్లు అధ్యాపకులు ఎన్ఎస్ఎస్ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటి పచ్చదనం-పరిశుభ్రత నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ చెన్నూరి గంగాధర్ తో పాటు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి తిరునహరి రణధీర్ కుమార్, అధ్యాపకులు డాక్టర్ ఎస్. ఎస్. రాజు, సుధగోని సత్యనారాయణ, వి. సదాశివ్, వి రజని, బి.ఎల్లయ్య, బి. వాల్య , ఎస్. వెంకట ముత్యం, సిహెచ్. విద్యాసాగర్, పి. చంద్రమోహన్, సిహెచ్ రాజిరెడ్డి, ఎస్. అశోక్, ఎం వెంకటేష్, ఏ. మమత, గ్రంథ పాలకులు ఆర్.వాసవి, వెంకటసాయి మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ విద్యార్థులు పాల్గొన్నారు.

