BIKKI NEWS (JAN. 05) : JL TO PRINCIPAL PROMOTIONS IN GJCs. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 61 మంది జూనియర్ లెక్చరర్స్ కు త్వరలో ప్రిన్సిపాళ్లుగా ప్రమోషన్ కల్పించేందుకు ఇంటర్మీడియట్ విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది.
JL TO PRINCIPAL PROMOTIONS IN GJCs.
రెండు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి కానుంది. అంతేకాకుండా 11 మంది సీనియర్ ప్రిన్సిపాళ్లను ఇటీవల జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారులు (డీఐఈఓ)గా తాత్కాలికంగా నియమించారు. దానికి ఆమోదం లభిస్తే ఆ 11 ప్రిన్సిపాళ్ల పోస్టులు ఖాళీ అవుతాయి.
దానికి తోడు 61 మంది జూనియర్ అసిస్టెంట్లు.. సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందనున్నారు.
గ్రూపు-3 ద్వారా త్వరలో 60 మంది వరకు జూనియర్ అసిస్టెంట్లు రానున్నారు. వారిలో కొంత మందిని జిల్లాలకు కూడా పంపాలని ఇంటర్ విద్యాశాఖ భావిస్తోంది.
అలాగే రాష్ట్రంలోని 430 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 892 మంది అతిథి అధ్యాపకులు పని చేస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి 60 మంది అధ్యాపకులు రిటైరవుతారు. మరో 60 మందికి పదోన్నతులు లభిస్తే.. అప్పుడు 1,012 మంది అతిథి అధ్యాపకులు అవసరం.
- Today Gold Rate September 29th 2026 – మళ్ళీ భారీగా తగ్గిన బంగారం ధర
- Crop Insurance – యాసంగికి ముందు పంటల బీమా.. రైతులకు ప్రభుత్వం గుడ్న్యూస్
- Rajiv Yuva Vikasam – నవంబరులో రాజీవ్ యువ వికాసం.. విద్యార్థుల ఖాతాల్లో రూ.450 కోట్ల బోధన ఫీజులు
- Assam Rifles Recruitment 2026: 354 టెక్నికల్, ట్రేడ్స్మన్ ఉద్యోగాలు
- Standard GK bits in Telugu part 179 – జీకే బిట్స్

