జిజేసి జనగాంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

BIKKI NEWS (AUG. 15) : independence day celebrations in GJC jangaon. ప్రభుత్వ జూనియర్ కళాశాల జనగాం లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ నాముని పావని కుమారి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.

independence day celebrations in GJC jangaon.

ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ… పంజరంలోని పక్షికే ఎగరడంలోని ఆనందం అర్థం అవుతుంది, బోనులోని జింకకే పరుగు విలువ తెలుస్తుంది.. ఒడ్డున పడిన చేపకే పరాధీనతలోని హింస అవగాహనకు వస్తుంది.. మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ .. అయాచితం కాదు, యాదృచ్ఛికంగానూ రాలేదు.. పోరాటాల ఫలితమిది.. త్యాగాలవరమిది… మన దేశం కోసం ప్రాణాలను అర్పించిన అమర వీరులను స్మరించుకుంటూ, ఐకమత్యం, సోదర భావం, అభివృద్ధి మార్గంలో ముందుకు సాగుదాం అంటూ ప్రసంగించారు .

భవిష్యత్తు తరాల కోసం మన దేశాన్ని మరింత బలంగా, సుసంపన్నంగా తీర్చిదిద్దుదాం. సార్వభౌమాధికార, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర లక్ష్యాల అందటమే నిజమైన స్వతంత్రమని పిలుపునిచ్చారు.