BIKKI NEWS (NOV. 03 ) ICC WOMEN CRICKET WORLD 2025 WON BY INDIA. మహిళల వన్డే క్రికెట్ ప్రపంచ కప్ 2025 విజేతగా భారత జట్టు నిలిచింది. ఫైనల్ లో సౌతాఫ్రికా జట్టు పై 52 పరుగులు తేడాతో ఘన విజయం సాధించింది.
ICC WOMEN CRICKET WORLD 2025 WON BY INDIA
చరిత్రలో తొలిసారిగా మన అమ్మాయిలు ప్రపంచ కప్ ను ముద్దాడారు. గతంలో రెండు సార్లు ఫైనల్ కు చేరుకున్న రన్నరప్ గా సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈసారి మాత్రం విశ్వ విజేత గా నిలిచారు.
సెమీ ఫైనల్ లో ఆస్ట్రేలియాను రికార్డు చేజింగ్ తో ఆత్మవిశ్వాసం కొండంత పెరిగిన నేపథ్యం ఫైనల్ లో సౌతాఫ్రికా పై విజయానికి దారి తీసింది.
మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 298/7 పరుగులు సాధించింది. షెఫాలీ వర్మ 87, దీప్తి శర్మ 58 పరుగులతో రాణించారు.
అనంతరం సౌతాఫ్రికా జట్టు 45.3 ఓవర్లలో 246 పురుషులకే ఆలౌట్ అయింది. దీప్తి శర్మ 5 వికెట్లు తీసింది కెప్టెన్ లారా (101) సెంచరీ వృదా అయింది.
ఆస్ట్రేలియా 7 సార్లు, ఇంగ్లాండ్ 4 సార్లు, న్యూజిలాండ్, భారత్ లు తలో ఒక్కసారి ప్రపంచ కప్ విజేతలుగా నిలిచాయి.
ఫైనల్ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా షెఫాలీ వర్మ ర్మ నిలిచింది. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా దీప్తి శర్మ నిలిచారు.
- Today Gold Rate September 29th 2026 – మళ్ళీ భారీగా తగ్గిన బంగారం ధర
- Crop Insurance – యాసంగికి ముందు పంటల బీమా.. రైతులకు ప్రభుత్వం గుడ్న్యూస్
- Rajiv Yuva Vikasam – నవంబరులో రాజీవ్ యువ వికాసం.. విద్యార్థుల ఖాతాల్లో రూ.450 కోట్ల బోధన ఫీజులు
- Assam Rifles Recruitment 2026: 354 టెక్నికల్, ట్రేడ్స్మన్ ఉద్యోగాలు
- Standard GK bits in Telugu part 179 – జీకే బిట్స్

