- BIKKI NEWS : 15 JAN. 2026
HENLEY PASSPORT INDEX 2026. హెన్లీ పాస్ పోర్ట్ ఇండెక్స్ 2026 పూర్తి నివేదిక వెల్లడించింది.. ఇందులో భారత్ పాస్ పోర్ట్ కు 80వ స్థానం దక్కింది గతేడాది (85) కంటే ఐదు స్థానాలు మెరుగుపరుచుకుంది..
HENLEY PASSPORT INDEX 2026.
ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్ పోర్టుల నివేదికను హెన్లీ సంస్థ ప్రతి సంవత్సరం విడుదల చేస్తుంది. ఎక్కువ దేశాలకు అనుమతి ఇచ్చే సురక్షితమైన పాస్ పోర్టులను శక్తివంతమైన పాస్ పోర్ట్ లుగా గుర్తిస్తుంది.
ఇందులో సింగపూర్ దేశం మొదటి స్థానంలో నిలవగా జపాన్, సౌత్ కొరియా రెండు మూడు స్థానాలలో నిలిచాయి అమెరికా 10వ స్థానంలో నిలిచింది.
భారత్ పాస్ పోర్ట్ ద్వారా 55 దేశాలకు వీసా ఫ్రీ లేదా వీసా ఆన్ అవరైవల్ కింద ప్రయాణించవచ్చు.
సింగపూర్ పాస్పోర్ట్ ద్వారా 192 దేశాలకు, జపాన్, సౌత్ కొరియా పాస్పోర్టుల ద్వారా 188 దేశాలకు వీసా ప్రయాణం చేయవచ్చు.
పాకిస్తాన్ దేశ పాస్పోర్ట్ 98వ స్థానంలో ఉంది. మన పొరుగు దేశాలలో చైనా, మాల్దీవులు మాత్రమే భారత్ కంటే బలమైన పాస్పోర్ట్ ను కలిగి ఉన్నాయి
TOP 5 STRONG PASSPORTS
1) సింగపూర్
2) జపాన్, సౌత్ కొరియా
3) డెన్మార్క్, స్పెయిన్, స్వీడన్, స్విట్జర్లాండ్ మరియు లక్సెంబర్గ్
4) ఆస్ట్రియా, బెల్జియం, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీస్, ఐర్లాండ్, ఇటలీ, నెదర్లాండ్స్ మరియు నార్వే
5) హంగేరి, పోర్చుగల్, స్లోవేకియా, స్లోవేనియా మరియు యూఏఈ
LAST 5 COUNTRIES LIST
101) ఆప్ఘనిస్తాన్
100) సిరియా
99) ఇరాక్
98) పాకిస్తాన్, యెమెన్
97) సోమాలియా
India Neighbour countries rank
52) మాల్దీవులు
59) చైనా
80) ఇండియా
85) భూటాన్
93) శ్రీలంక
95) బంగ్లాదేశ్
96) నేపాల్
98) పాకిస్తాన్
101) ఆప్ఘనిస్తాన్
- Today Gold Rate September 29th 2026 – మళ్ళీ భారీగా తగ్గిన బంగారం ధర
- Crop Insurance – యాసంగికి ముందు పంటల బీమా.. రైతులకు ప్రభుత్వం గుడ్న్యూస్
- Rajiv Yuva Vikasam – నవంబరులో రాజీవ్ యువ వికాసం.. విద్యార్థుల ఖాతాల్లో రూ.450 కోట్ల బోధన ఫీజులు
- Assam Rifles Recruitment 2026: 354 టెక్నికల్, ట్రేడ్స్మన్ ఉద్యోగాలు
- Standard GK bits in Telugu part 179 – జీకే బిట్స్

