Top Current affairs 2026 September 26th – కరెంట్ అఫైర్స్

Top current affairs 2026 september 26th

BIKKI NEWS : Top Current affairs 2026 September 26th – కరెంట్ అఫైర్స్

Top Current affairs 2026 September 26th

1) అణు ఆయుధాల సంపూర్ణ నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవాన్ని (International Day for the Total Elimination of Nuclear Weapons) ఐక్యరాజ్యసమితి ఏ రోజున నిర్వహిస్తుంది?
A: సెప్టెంబర్ 26.

2)ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవాన్ని (World Environmental Health Day) ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటారు?
A : సెప్టెంబర్ 26.

3)కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) సెప్టెంబర్ 26న ఎన్నవ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంది?
A : 84వ వ్యవస్థాపక దినోత్సవం (1942 సెప్టెంబర్ 26న ఏర్పాటైంది).

4)ఆసియా క్రీడల్లో పురుషుల రికర్వ్ ఇండివిజువల్ ఆర్చరీ క్వాలిఫికేషన్‌లో 720 పాయింట్లకు గాను 698 పాయింట్లు సాధించి సరికొత్త రికార్డు సృష్టించిన భారత ఆర్చర్ ఎవరు?
A : బొమ్మదేవర ధీరజ్ (Dhiraj Bommadevara).

5)ఆసియా క్రీడల మహిళల కబడ్డీ ఫైనల్లో ఇరాన్‌ను 37-34 తేడాతో ఓడించి స్వర్ణ పతకం సాధించిన జట్టు ఏది?
A : భారత మహిళల కబడ్డీ జట్టు.

6)10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో బంగారు పతకం సాధించిన భారత షూటింగ్ జోడీ ఎవరు?
A : సురుచి సింగ్ మరియు కమల్‌జీత్ సింగ్.

7)పురుషుల 200 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ ఈత పోటీల్లో సరికొత్త జాతీయ రికార్డు నమోదు చేసిన 19 ఏళ్ల భారత స్విమ్మర్ ఎవరు?
A : రిషభ్ దాస్ (Rishabh Das).

8)చైనాలోని షాంఘైలో ముగిసిన 48వ ‘వరల్డ్‌స్కిల్స్’ (WorldSkills) పోటీలలో భారతదేశం ఎన్నవ స్థానంలో నిలిచింది?
A : 10వ స్థానం (6 రజత పతకాలు, 20 మెడల్స్ ఫర్ ఎక్సలెన్స్).

9)మహిళల పోల్‌వాల్ట్ పోటీల్లో 4.15 మీటర్ల ఎత్తును దాటి కాంస్య పతకం సాధించిన భారత అథ్లెట్ ఎవరు?
A : బరణిక ఇలంగోవన్ (Baranica Elangovan).

10)మొత్తం వ్యాపారంలో ₹1 లక్ష కోట్లను అధిగమించి భారతదేశంలోనే అతిపెద్ద అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ (UCB)గా నిలిచిన బ్యాంక్ ఏది?
A : సరస్వత్ కో-ఆపరేటివ్ బ్యాంక్ (Saraswat Co-operative Bank).

11)భారతదేశంలో ఇళ్ల పైకప్పులపై సౌర విద్యుత్ పలకలను అమర్చి ఉచిత విద్యుత్ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం ఏది?
A : పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన (PM Surya Ghar Muft Bijli Yojana).

12)భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం ‘సురక్షిత రోడ్డు ప్రయాణం పొందే హక్కు’ ప్రాథమిక హక్కుగా గుర్తించబడింది?
A: ఆర్టికల్ 21 (జీవించే హక్కు).

13)తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ గాంధీ సివిల్ సర్వీసెస్ అభయహస్తం కింద యూపీఎస్సీ మెయిన్స్ రాసే అభ్యర్థులకు ఎంత ఆర్థిక సహాయం అందిస్తోంది?
A : ₹1 లక్ష నగదు ప్రోత్సాహకం.

14)ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు ఏ వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి భక్తులకు దర్శనమిస్తారు?
A : పెద్దశేష వాహనం.

15) ఐక్యరాజ్యసమితి సాధారణ సభ (UNGA) అంతర్జాతీయ సైబర్ నేరాలను అరికట్టడానికి ఆమోదించిన చారిత్రాత్మక ఒప్పందం ఏది?
A : యూఎన్ సైబర్ క్రైమ్ కన్వెన్షన్ (UN Cybercrime Convention).

    Google News @WHATSAPP
    @TELEGRAM@FACEBOOK
    Avatar of saheb shaik

    About Saheb Shaik

    Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

    View all posts by Saheb Shaik →