BIKKI NEWS : Daily GK bits in Telugu part 178 – డైలీ జీకే బిట్స్
Daily GK bits in Telugu part 178
1) గడ్డ కట్టిన మహా సముద్రం అని దేనికి పేరు.?
జ : ఆర్కిటిక్
2) మధ్యాహ్న రేఖలు అనే వేటిని అంటారు.?
జ : రేఖాంశాలు
3) భారత దేశంలో భూ పరివేష్టిత కేంద్ర పాలిత ప్రాంతాలు ఏవి.?
జ : ఢిల్లీ, చండీగఢ్
4) భారత దేశంలో అతి తక్కువ భూభాగ సరిహద్దు కలిగి ఉన్న దేశం ఏది?
జ : ఆఫ్ఘనిస్తాన్ (80 కిలోమీటర్లు)
5) ఏ పురాణం ప్రకారం భారత దేశాన్ని జంబు ద్వీపంగా పేర్కొన్నారు.?
జ : మార్కండేయ పురాణం
6) సూయజ్ కాలువ ఏ రెండు సముద్రాలను కలుపుతుంది.?
జ : మధ్యధరా సముద్రము & ఎర్ర సముద్రం
7) పుష్పాలు గురించి అధ్యయనం చేయు శాస్త్రం ఏది.?
జ : అంథాలజీ
8) యాపిల్ లో తినదగిన భాగం ఏది.?
జ : పుష్పాసనం
9) బుడిపెలు ఉన్న వేర్లలో ఏ బాక్టీరియా ఉంటుంది.?
జ : రైజోబియం
10) అతిపెద్ద పుష్పం ఏమిటి.?
జ : లొడిషియా
11) రుద్రాక్ష మాల లాంటి వేళ్ళు ఉండే మొక్క ఏది.?
జ : డిస్కిడియా
12) ఉల్లిపాయలు కోసినప్పుడు కన్నీళ్లు రావడానికి కారణం ఏమిటి.?
జ : ఆల్డైల్ సల్పైడ్
13) యధా తద ఒప్పంద నిబంధన ప్రకారం భారత ప్రభుత్వం ఎవరిని హైదరాబాదులో ఏజెంట్ జనరల్ గా నియమించింది.?
జ : కే ఎం మున్షి
14) “హైదరాబాద్ భారత దేశ గర్భంలో రాచ పుండు” అని ఎవరు వ్యాఖ్యానించారు.?
జ : సర్దార్ వల్లభాయ్ పటేల్
15) నిజాం రాజ్యాన్ని భారత్ లో విలీనం చేయడానికి ఆపరేషన్ పోలో ఎప్పుడు ప్రారంభమైంది.?
జ : సెప్టెంబర్ 13 1948
16) ఆపరేషన్ పోలో పేరిట పోలీస్ చర్యకు ఎవరు నాయకత్వం వహించారు.?
జ : భారత మిలటరీ చీఫ్ జెన్ చౌదరి
17) ఆపరేషన్ పోలో సమయంలో నిజాం సైన్యానికి ఎవరు నాయకత్వం వహించారు .?
జ : ఎల్ ఎడ్రోస్
18) నిజామ్ రాజ్యంపై ఆపరేషన్ పోలో చర్య ఎన్ని రోజుల్లో పూర్తయింది.?
జ : కేవలం ఐదు రోజులు
19) సెప్టెంబర్ 18న హైదరాబాదులో మిలిటరీ పాలన ప్రారంభమైంది . దీనికి సైనిక గవర్నర్ గా ఎవరు నియమించబడ్డారు.?
జ : జేయన్ చౌదరి
20) హైదరాబాద్ రాజ్యంలో జేఎన్ చౌదరి నేతృత్వంలోని మిలిటరీ పాలన ఎప్పుడు ముగిసింది.?
జ : 1949 డిసెంబర్ 31

