RAIN ALERT – రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు

Heavy rains in Telangana next 3 days

BIKKI NEWS (SEP. 08) : Heavy rains in Telangana next 3 days. తాజాగా వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్‌ ప్రభావం క్రమంగా పెరుగుతుండడంతో.. సెప్టెంబర్ 9, 10,11వ తేదీల్లో మూడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే గాలివానలు, ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని తెలిపింది.

Heavy rains in Telangana next 3 days

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మంగళ, బుధ వారాల్లో భారీ వర్షాలు, బలమైన గాలులు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

హైదరాబాద్‌, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, ఖమ్మం, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, సిద్ధిపేట, హన్మకొండ, యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాల్లో గాలివానలు, ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉంది.

ముఖ్యంగా పగలంతా ఎండ కాస్తూ సాయంత్రం, రాత్రి వేళల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.