BIKKI NEWS (OCT. 08) : HEARING ON BC RESERVATIONS IN HIGH COURT. తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో బీసీ రిజర్వేషన్లపై ఇవాళ కీలక విచారణ జరుగుతుంది ఈ నేపథ్యంలో ఇరు పక్షాలు తమ వాదనలను బలంగా వినిపిస్తున్నాయి. విచారణ ఇంకా రేపటికి వాయిదా పడింది.
నామినేషన్లు తీసుకోవడంపై స్టే విధించాలన్న పిటిషన్ దారుల వాదనను హైకోర్టు తోసిపొచ్చింది. అక్టోబర్ 9 మధ్యాహ్నం 2:15 నిమిషాలకు ఈ కేసు విచారణను వాయిదా వేసింది.
HEARING ON BC RESERVATIONS IN HIGH COURT.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తెచ్చిన జీవో 9పై పిటిషన్ వేసిన వారి తరుపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ 42 శాతం రిజర్వేషన్ల పెంపుపై శాస్త్రీయ ఆధారాలు చూపకుండానే రిజర్వేషన్లు పెంపుదల చేసిందని, బీసీ కుల గణన చేసిన ఇంతవరకు ఆ నివేదిక బయటకు పెట్టలేదని వాదనలు వినిపించారు.
విద్యా ఉద్యోగాల్లో 50% రిజర్వేషన్లు దాటిన, రాజకీయంగా 50% దాటకూడదని నిబంధన ఉన్నదని గుర్తు చేశారు.
2018లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెచ్చిన ఉత్తర్వులు కూడా ఇదే హైకోర్టు తిరస్కరించిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు .
కేవలం ఏజెన్సీ ప్రాంతంలోని ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్ల పరిమితి నిబంధన వర్తించదని గుర్తు చేశారు.
రాజ్యాంగబద్ధంగా ఎన్నికల నిర్వహించడం పట్ల తాము సానుకూలంగా ఉంటామని, రాజ్యాంగ విరుద్ధంగా ఎన్నికలు చేపట్టరాదని కోరుకుంటున్నామని కోర్టులో వాదించారు..
ప్రభుత్వం తరఫున అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపిస్తూ బీసీ రిజర్వేషన్ల బిల్లును అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించాలని గుర్తు చేశారు.
శాసన వ్యవస్థ చేసిన చట్టాన్ని ఎవరు ప్రశ్నించజాలరని ఈ సందర్భంగా గుర్తు చేశారు. జీవో నెంబర్ 9 పై స్టే ఇవ్వాలని కోరడం సరికాదని తెలిపారు.
బీసీ ప్రత్యేక (డెడికేటెడ్) కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగానే రిజర్వేషన్ల పెంపు జరిగిందని తెలిపారు.
ప్రజా సంక్షేమం కోసం రిజర్వేషన్లు పెంచుకునే అవకాశం ప్రభుత్వాలకు ఉందని ఈ సందర్భంగా తెలిపారు.
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
- Today in history August 7th – చరిత్రలో ఈరోజు ఆగస్టు 07.
