1654 మంది గెస్ట్ లెక్చరర్లను యధావిధిగా కొనసాగించాలి

  • 1654 సంఖ్యను తగ్గించకుండా కాంగ్రేస్ పార్టీ మేనిఫెస్టో, ప్రభుత్వ హామీ మేరకు అందరినీ కొనసాగించాలి
  • 4 నెలల పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలి*
  • ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి ని కలిసి వినతిపత్రం అందజేసిన గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ ప్రతినిధులు

BIKKI NEWS (SEP. 04) : Guest junior lecturers renewal news. కాంగ్రేస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో హామీ ప్రకారం ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో గత 12 సంవత్సరాలు గా పనిచేస్తున్న 1,654 మంది గెస్ట్ లెక్చరర్ల రెన్యూవల్ మరియు రెగ్యూలర్ లెక్చరర్ల నియామకం వల్ల డిస్టర్బ్ ఐన వారిని అడ్జస్ట్ మెంట్ చేయడం కోసం సీఎం కార్యాలయం నుండి వచ్చిన ఆదేశాల ప్రకారం ఇంటర్ బోర్డు కార్యదర్శి తేది:13-06-25 న ప్రభుత్వ ఆమోదం కోసం పంపిన 1654 గెస్ట్ ఫ్యాకల్టీ కంటిన్యూయేషన్ ఫైల్ లో ఫైనాన్స్ అధికారులు వివిధ కారణాలు చూపి పోస్టుల సంఖ్య తగ్గింపు చేసి కేవలం 398 పోస్టులకు మాత్రమే జీవో ఇస్తున్నారు.

Guest junior lecturers renewal news.

అదే జరిగితే దాదాపు 1300 మంది కుటుంబాల పరిస్థితి ప్రశ్నార్థకం కానుంది.. ఈ క్రమంలో 398 పోస్టులతో కళాశాలల నిర్వాహణ కష్టమౌతుందని తేది: 21/08/2025 నాడు బోర్డ్ సెక్రటరీ అదనంగా 1256 పోస్టులకు అనుమతివ్వాలని ప్రభుత్వానికి మళ్ళీ ప్రతిపాదనలను పంపడం జరిగింది. దానిపై ఫైనాన్స్ అధికారులు ఇంకా నిర్ణయం తీసుకోలేదు..

1654 పోస్టులలో సంఖ్య తగ్గిస్తే దాదాపు 1300 మంది రోడ్డున పడుతున్నారని కేవలం 398 పోస్టులతో అనుమతివ్వకుండా మొత్తం 1654 (398+1256) పోస్టులకు అనుమతివ్వాలని, గత సంవత్సరానికి సంబందించిన 4 నెలల పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారిని గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అద్యక్షుడు దామెర ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి దార్ల భాస్కర్, అసోసియేట్ ప్రెసిడెంట్ కోడి మహేష్ కుమార్, ఎం.బాబురావు, సంయుక్త కార్యదర్శులు కె. వెంకటేష్, రాంచందర్ లు మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ విషయాన్ని సీఎం మరియు డిప్యూటీ సీఎం ల దృష్టికి తీసుకుపోయి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారని సంఘం ప్రతినిధులు తెలిపారు.