- ప్రత్యేక చొరవ తీసుకున్న బోర్డ్ సెక్రటరీ కృష్ణ ఆదిత్యకు కృతజ్ఞతలు
- పెండింగ్ వేతనాల బడ్జెట్ విడుదల, అదనపు పోస్టులకు అనుమతించిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క లకు కృతజ్ఞతలు
- ప్రభుత్వ నిర్ణయంపై జూనియర్ కాలేజ్ గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దామెర ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి దార్ల భాస్కర్, అసోసియేట్ ప్రెసిడంట్ కోడి మహేష్ కుమార్ హర్షం
BIKKI NEWS (OCT. 30) : Guest junior lecturers pending salaries released. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లకు సంబందించిన పెండింగ్ వేతనాలకు (డిసెంబర్ 2024 నుండి మార్చి 2025) సంబంధించి 1665 మందికి 17,56,70, 230 రూపాయల బడ్జెట్ ను గౌరవ ఇంటర్ బోర్డ్ సెక్రటరీ కృష్ణ ఆదిత్య గారు విడుదల చేయడం జరిగింది.
Guest junior lecturers pending salaries released.
అదే క్రమంలో ఇటీవలే ఈ విద్యా సంవత్సరం 398 మందికి నాలుగు నెలల (జూన్ నుండి సెప్టెంబర్) వేతనాలను సైతం విడుదల చేయడం జరిగింది.
అదే విధంగా.. ఈ విద్యా సంవత్సరం 398 కాక జేఎల్ అపాయింట్ మెంట్ కారణంగా డిస్టర్బ్ ఐన 494 మందిని అడ్జస్ట్ మెంట్ చేయడానికి ఆర్థిక శాఖతో చర్చించి అనుమతి వచ్చేలా చొరవ తీసుకున్న సెక్రటరీ కృష్ణ ఆదిత్య గారికి, గెస్ట్ లెక్చరర్ల కు విషయంలో సానుకూల నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఇతర మంత్రులకు, ఫైనాన్స్ డిపార్ట్ మెంట్, ఇంటర్ బోర్డ్ అధికారులకు గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దామెర ప్రభాకర్, ప్రదాన కార్యదర్శి దార్ల భాస్కర్, అసోసియేట్ ప్రెసిడంట్ కోడి మహేష్ కుమార్, రాష్ట్ర, జిల్లా కమిటీ నాయకులు కృతజ్ఞతలు తెలియజేశారు.
- TG SSC EXAM DATES – తెలంగాణ పదో తరగతి పరీక్షల షెడ్యూల్
- Holidays – విద్యా సంస్థలకు సెలవులు
- Today in history – చరిత్రలో ఈరోజు డిసెంబర్ 09
- TELANGANA HOLIDAYS 2026 – తెలంగాణలో సెలవుల లిస్టు
- Today in history – చరిత్రలో ఈ రోజు డిసెంబర్ 08

