BIKKI NEWS (FEB. 16) : GK BITS PART 98 FOR COMPITITIVE EXAMS. , పోటీ పరీక్షల ప్రాక్టీసు కొరకు డైలీ జీకే బిట్స్.
GK BITS PART 98 FOR COMPITITIVE EXAMS.
1) 1828 లో పర్యావరణం అనే పదాన్ని మొదట ఉపయోగించినది ఎవరు.?
జ : థామస్ కార్లైల్
2) ఏ బలం కారణంగా భూమి చుట్టూ చంద్రుడు వలయాకారంలో తిరుగుతున్నాడు.?
జ : అభికేంద్రక బలం
3) ఏ సాంకేతికతను ఉపయోగించి ఆన్యూరిజంను గుర్తించవచ్చు.?
జ : MRI
4) స్వచ్ఛమైన స్వదేశీ పశువుల జాతి పరిరక్షించడం కోసం ప్రారంభించిన కార్యక్రమం పేరు ఏమిటి?
జ : ఇండిగౌ
5) భారత ప్రభుత్వంచే 2002లో ఆమోదించబడిన ఏకైక జన్యు మార్పిడి పంట ఏది.?
జ : బీటీ పత్తి
6) భారతదేశంలో మొట్టమొదటి బయో ప్యూయల్ ఫ్లైట్ ఏ నగరాల మధ్య ప్రయాణించింది.?
జ : డెహ్రాడూన్ – ఢిల్లీ
7) దీనిని మొట్టమొదటి గణన పరికరంగా భావిస్తారు.?
జ : అబాకస్
8) ఏ ప్రసిద్ధ శైవ క్షేత్రంలో గల దేవతకు మద్ది చెట్టు మరియు మల్లె మొక్క అనే పేరు పెట్టారు.?
జ : శ్రీశైలం
9) బౌద్ధ గ్రంథాలలో ‘కమ్మకారులు’ అనే పదం ఎవరిని సూచిస్తుంది.?
జ : వ్యవసాయ కూలీలు
10) మొగలుల ఏ రాజు కాలంలో మొగల్ చిత్రలేఖనంలో క్రైస్తవ భావనలు ప్రవేశపెట్టబడ్డాయి.?
జ : అక్బర్
11) ఏ లిపి నుండి తమిళ వర్ణమాల ఏర్పడినట్లు భావిస్తారు.?
జ : గ్రంధ లిపి
12) అక్బర్ ఆస్థానంలో ఉండే నవరత్నాలలో తాన్‌సేన్ అసలు పేరు ఏమిటి.?
జ : రామ్ థన్ పాండే
13) “చికిత్స సార – సంగ్రహ” అనే గ్రంథకర్త ఎవరు.?
జ : చక్రపాణి దత్త
14) “అష్టాంగహృదయ సంహిత” గ్రంథకర్త ఎవరు.?
జ : వాగ్బటుడు
15) “రుగ్వినిశ్చయ” గ్రంథకర్త ఎవరు.?
జ : మాధవకర
16) “సుశృత సంహిత” గ్రంథ రచయిత ఎవరు.?
జ : సుశ్రుతుడు
17) తెలంగాణ రాష్ట్రంలో పొడవైన రహదారులు ఉన్న జిల్లా ఏది.?
జ : నల్లగొండ
18) యాదాద్రి జిల్లాలో మద్య శిలాయుగం నాటి అవశేషాలలో ఏ చిత్రం కనుగొనబడింది.?
జ : ఏనుబోతు
19) 1975 వ సంవత్సరంలో విధించిన అత్యవసర పరిస్థితి కాలంలో ఏర్పడిన పరిస్థితులపై ఏర్పాటుచేసిన కమిషన్ పేరు ఏమిటి.?
జ : జేసి షా కమిషన్
20) భారత దేశంలో భూ సంస్కరణలు మరియు హరిత విప్లవం ఏ ప్రధాని కాలంలో విజయవంతం అయ్యాయి.?
జ : ఇందిరా గాంధీ
21) రాజ్యాంగాన్ని పార్లమెంట్ సవరణ చేసే హక్కు ఏ ఆర్టికల్ ప్రకారం లభిస్తుంది.?
జ : ఆర్టికల్ 368
22) భారత దేశంలో రాజ్యాంగ సభ ఏర్పాటుకు ప్రతిపాదించిన మిషన్ ఏది.?
జ : క్యాబినెట్ మిషన్ పథకం – 1946
23) ఆసియా నోబెల్ గా ఏ బహుమతిని భావిస్తారు.?
జ : రామన్ మెగాసేసే అవార్డు
24) ఆత్మహత్య అనేది నేరమని ఐపీసీ లోని ఏ సెక్షన్ పేర్కొంటుంది.?
జ : సెక్షన్ – 309
25) నార్కో అనాలసిస్ పరీక్ష రాజ్యాంగ విరుద్ధమని ఏ కేసు సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.?
జ : సెల్వీ vs స్టేట్ ఆఫ్ కర్ణాటక
26) స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కు రాజ్యంగానికి ఆత్మ వంటిదని పేర్కొన్నది ఎవరు.?
జ : జస్టిస్ సిక్రీ
27) భారతదేశంలో మొట్టమొదటిసారి కరెన్సీ నోట్లను జారీ చేసిన బ్యాంకు ఏది.?
జ : బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్
28) భారతదేశంలో రూపాయి నోటును ఎవరు జారీ చేస్తారు.?
జ : కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ
29) కరెన్సీ నోటు పై దాని విలువను ఎన్ని భారతీయ భాషల్లో ఆర్బిఐ ముద్రిస్తుంది.?
జ : 17
30) మూడు వైపులా నీరు సరిహద్దుగా గల భూప్రాంతాన్ని ఏమంటారు.?
జ : ద్వీప కల్పం

