Gallantry Awards – సైనికులకు ఇచ్చే అత్యున్నత పురస్కారాల జాబితా

Gallantry Awards list in telugu bikki news
  • BIKKI NEWS : 26-01-2026

gallantry awards list in telugu. భారతదేశం అన్ని రకాల ర్యాంకింగ్ లు కలిగిన సైనికులకు (ఆర్మీ, నావీ, ఎయిర్ పోర్స్) యుద్ధం, శాంతి సమయాలలో అత్యున్నత దైర్య సహసాలు చూపించినందుకు జనవరి 26 మరియు ఆగస్టు 15 న గ్యాలంటరీ అవార్డులను రాష్ట్రపతి అందిస్తారు.

Gallantry Awards list in telugu

యుద్ధ సందర్భంగా :-

  • భారత దేశ సైనికులకు ఇచ్చే అత్యున్నత గ్యాలంటరీ అవార్డు : పరమవీర చక్ర
  • 2వ అత్యున్నత గ్యాలంటరీ అవార్డు : మహావీర చక్ర
  • 3వ అత్యున్నత గ్యాలంటరీ అవార్డు : వీరచక్ర

శాంతి సందర్భంగా :

  • 1వ అత్యున్నత గ్యాలంటరీ అవార్డు : అశోక చక్ర (4వ)
  • 2వ అత్యున్నత గ్యాలంటరీ అవార్డు : కీర్తి చక్ర(5వ)
  • 3వ అత్యున్నత గ్యాలంటరీ అవార్డు : శౌర్య చక్ర (6వ)
యుద్ధ సమయంలో అత్యున్నత పురష్కారాలు :-

పరమవీరచక్ర :- ఇది భారత్ లో అత్యున్నత సైనిక పురస్కారం. కాంస్యంతో వృత్తాకారంలో తయారు చేయబడిన ధైర్యసాహసాలకిచ్చే అత్యుత్తమ భారతీయ అవార్డు పరమవీరచక్ర అవార్డును ఊదారంగు రిబ్బన్లో అలంకరిస్తారు.

ఇంద్రుడి వజ్రాయుధాన్ని పోలిన ఆయుధాలు 4 వైపులా ఉండి మధ్యలో జాతీయ చిహ్నాన్ని కలిగి ఉండే అవార్డు. పరమవీరచక్ర అవార్డు పొందిన మొదటివ్యక్తి – మేజర్ సోమనాధశర్మ(1947 నవంబర్ 3)

మహావీరచక్ర :- ఈ అవార్డును వెండితో తయారు చేస్తారు. – ఈ అవార్డును సగం తెలుపు, సగం నారిజరంగు గల రిబ్బన్ తో అలంకరిస్తారు.

వీర్ చక్ర :- ఈ అవార్డుకు మధ్యలో అశోక చక్రం ఉంటుంది. ఈ అవార్డును కూడా వెండితో తయారు చేస్తారు.

శాంతి సమయంలో ఇచ్చే అత్యున్నత పురష్కారాలు :

అశోక చక్ర :– యుద్ధం జరగని సమయంలో, శాంతి సమయంలో అత్యున్నత ధైర్యసాహసాలు ప్రదర్శించిన వారికి ఇస్తారు.

అశోక చక్ర అవార్డును పచ్చటి సిల్కు రిబ్బన్ లో అలంకరిస్తారు. ఈ అవార్డు పొందిన తొలి మహిళ : కమలేష్ కుమారి. అవార్డు మధ్యలో అశోక చక్రం ఉంటుంది గిట్టు బంగారంతో చేసిన జ్ఞాపికను ఇచ్చే అవార్డు.

కీర్తి చక్ర, శౌర్యచక్ర :- ఈ అవార్డులను అశోక చక్ర అవార్డు వలె పచ్చటి సిల్కు రిబ్బన్ లో అలంకరిస్తారు.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of BIKKI NEWS

About BIKKI NEWS

"A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by BIKKI NEWS →