Guidelines - ఉద్యోగులకు నూతన హెల్త్ స్కీమ్ విధివిధానాలు - bikki news

GUIDELINES – ఉద్యోగులకు నూతన హెల్త్ స్కీమ్ విధివిధానాలు

  • BIKKI NEWS : 12 -02-2026

Employees health care Trust final guidelines 2026. హైదరాబాద్‌లో ఈ రోజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారి అధ్యక్షతన ఉద్యోగుల ఆరోగ్య భద్రత పథకం (Employees Health Insurance Scheme – EHS) అమలు అంశంపై సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సెంట్రల్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

Employees health care Trust final guidelines 2026

ఈ పథకం అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాన కార్యదర్శి గారు తెలిపారు. ఆ కమిటీలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నుండి ఆరుగురు సభ్యులు, పెన్షనర్ల నుండి ఇద్దరు సభ్యులు ఉంటారు. అదనంగా, ప్రభుత్వ ఉద్యోగులలో ఒకరిని సీఈఓగా రాష్ట్ర ప్రభుత్వం నియమించనుంది.

ఉద్యోగులు మరియు పెన్షనర్ల నుండి బేసిక్ పే లో 1.5% మొత్తాన్ని కంట్రిబ్యూషన్‌గా తీసుకోవాలని ఆమొత్తానికి సమానంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వంతు వాటాగా నిధులు జమ చేస్తుందని తెలిపారు . నగదు రహిత (Cashless) వైద్య సేవల కోసం అర్హత కలిగిన 515 ఆసుపత్రులను ప్రస్తుతానికి గుర్తించడం జరిగిందని, పథకాన్ని పారదర్శకంగా అమలు చేయాలని నిర్ణయించబడింది.

ప్రస్తుతం పోలీస్ శాఖకు ఆరోగ్య భద్రత స్కీం కింద, ఎక్సైజ్ శాఖకు సహాయత స్కీం కింద ఆరోగ్య పథకాలు అమలులో ఉన్నాయని, భవిష్యత్తులో ఆ శాఖల ఉద్యోగులను కూడా EHS పథకంలో చేర్చే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని తెలిపారు.

అవసరమైన విధి విధానాలను 15 రోజులలోగా సిద్ధం చేసి, 45 రోజులలోగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించనున్నట్లు ప్రధాన కార్యదర్శి గారు వెల్లడించారు.

ఈ సమావేశంలో చీఫ్ సెక్రటరి రామకృష్ణ రావు గారు , BMD ఎక్కా , స్పెషల్ సీఎస్ (సాధారణ పరిపాలన ), క్రిస్టినా జె చోంగ్తు , ప్రిన్సిపల్ సెక్రటరీ ( మెడికల్ & హెల్త్), సీవీ. ఆనంద్ Special Chief Secretary (Home) , అజయ్ కుమార్, ఛైర్మెన్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ పాల్గొన్నారు .

తెలంగాణ గెజిటెడ్ అధికారుల సెంట్రల్ అసోసియేషన్ ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ, ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సమగ్ర ఆరోగ్య భద్రత కల్పించే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు కృతజ్ఞతలు తెలిపింది.

పాల్గొన్నవారు మారం జగదీశ్వర్, చైర్మన్
ఏలూరి శ్రీనివాసరావు, సెక్రటరీ జనరల్ చావ రవి, దామోదర్ రెడ్డి, వంగ రవీందర్ రెడ్డి, దామోదర్ రెడ్డి – పెన్షనర్లు, ముజీబ్ హుస్సేన్, బి. శ్యామ్, దాస్య నాయక్, రమేష్, లక్ష్మయ్య, అబ్దుల్లా, ఉమాదేవి.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →