BIKKI NEWS (OCT. 31) : Ekta Diwas celebration in GJC HUSBAND GIRLS. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల హుస్నాబాద్ లో దేశ నాయకుడు, ఉక్కుమనిషి శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో జాతీయ ఐక్యత దినోత్సవ (National Unity Day) వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది.
Ekta Diwas celebration in GJC HUSBAND GIRLS
ఈ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపల్ మరియు ఎన్ఎస్ఎఫ్ చైర్మన్ శ్రీమతి వి. లలిత గారు శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి చిత్రపటానికి పూలమాలవేసి నమస్సుమాంజలి తెలిపి కార్యక్రమాన్ని ప్రారంభించి, అధ్యక్షత వహించడం జరిగింది.
కళాశాల ప్రిన్సిపాల్ మరియు అధ్యాపక బృందం, అధ్యాపకేతర బృందం మరియు విద్యార్థినిలు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు అందరూ కలిసి జాతీయ ఐక్యత దినోత్సవ( రాష్ట్రీయ ఏక్తా దివస్) ప్రతిజ్ఞ చేయడం జరిగింది.
కార్యక్రమాన్ని ఉద్దేశించి కళాశాల ప్రిన్సిపల్.మరియు ఎన్ఎస్ఎస్ చైర్మన్ శ్రీమతి వి లలితా గారు మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు స్వతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర వహించారని తెలుపుతూ రాష్ట్రాలను భారత దేశంలో విలీనం చేసిన.గొప్ప నాయకుడు అని పేర్కొంటూ ఉక్కు మనిషిగా పేరుగాంచారని మరియు రాజ్యాంగ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. విద్యార్థినిలు మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని ఆదర్శంగా తీసుకొని లక్ష్యాన్ని సాధించాలని తెలుపుతూ సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమం ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి శ్రీ డి కర్ణాకర్ గారి యొక్క పర్యవేక్షణలో జరిగినది.
ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం.శ్రీ డి రవీందర్, శ్రీమతి టి నిర్మలాదేవి, శ్రీ బి లక్ష్మయ్య, శ్రీ ఏ సంపత్, శ్రీమతి కే స్వరూప, శ్రీమతి ఎస్ కవిత, శ్రీమతి జీ కవిత, శ్రీమతి ఆస్మా పిర్దోస్, కుమారి ఓ రాణి, జూనియర్ అసిస్టెంట్లు శ్రీమతి కే గీతాంజలి మరియు శ్రీ ఎస్ రాములు విద్యార్థినిలు మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు మొదలగు వారు పాల్గొన్నారు.
- Telangana cabinet decisions – తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
- Intermediate admissions 2026 – ఇంటర్ అడ్మిషన్ల గడువు మరోసారి పెంపు
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
