- BIKKI NEWS : 21-01-2026
Direct salaries for contract and out sourcing employees. కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల బ్యాంక్ ఖాతాలోకి నేరుగా వేతనాలు వేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Direct salaries for contract and out sourcing employees.
ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు, హెచ్.వో.డీలు, మధ్యవర్తుల ద్వారా వేతనాలు ఇవ్వడం వల్ల భారీ అవకతవకలు జరగటం, వేతన చెల్లింపులు ఆలస్యం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఐదు లక్షల మంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
అయితే వీరికి IFMIS పోర్టల్ ద్వారా చెల్లించడమా లేక ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేసి దాని ద్వారా వేతనాలు చెల్లించడమా అనే దానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా వేతనాలు చెల్లించడం వలన భారీ స్థాయిలో అవకతవకులు జరుగుతున్నట్లు తాజాగా ఆర్థిక శాఖ గుర్తించింది .దీంతో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల బ్యాంకు ఎకౌంట్లు, ఆధార్ కార్డుల వివరాలను ఆర్థిక శాఖ సేకరించింది.
దాదాపు వందల కోట్ల నిధులు దారిమల్లినట్లు ఆర్థిక శాఖ గుర్తించింది. ఒకే ఉద్యోగి పేరుతో వేర్వేరు శాఖల నుంచి వేతనాలు పొందుతున్నట్లు కూడా తాజా వెరిఫికేషన్ లో బయటపడింది.
- Today Gold Rate September 29th 2026 – మళ్ళీ భారీగా తగ్గిన బంగారం ధర
- Crop Insurance – యాసంగికి ముందు పంటల బీమా.. రైతులకు ప్రభుత్వం గుడ్న్యూస్
- Rajiv Yuva Vikasam – నవంబరులో రాజీవ్ యువ వికాసం.. విద్యార్థుల ఖాతాల్లో రూ.450 కోట్ల బోధన ఫీజులు
- Assam Rifles Recruitment 2026: 354 టెక్నికల్, ట్రేడ్స్మన్ ఉద్యోగాలు
- Standard GK bits in Telugu part 179 – జీకే బిట్స్

