BIKKI NEWS (NOV. 26) : Constitution day celebrations in GJC GIRLS HUSNABAD. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల హుస్నాబాద్ లో జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది.
Constitution day celebrations in GJC GIRLS HUSNABAD
కళాశాల ప్రిన్సిపాల్ మరియు ఎన్ఎస్ఎస్ చైర్మన్ శ్రీమతి వి. లలిత గారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి నమస్సుమాంజలి తెలిపి కార్యక్రమాన్ని ప్రారంభించి అధ్యక్షత వహించడం జరిగింది.
కళాశాల ప్రిన్సిపాల్ మరియు అధ్యాపక బృందం, అధ్యాపకేతర బృందం మరియు విద్యార్థినిలు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు అందరూ కలసి భారత రాజ్యాంగానికి సంబంధించిన ప్రతిజ్ఞను చేయడం జరిగింది.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కళాశాల ప్రిన్సిపాల్ మరియు ఎన్ఎస్ఎస్ చైర్మన్ లలిత గారు మాట్లాడుతూ… భారత రాజ్యాంగ ఆవిర్భావం మరియు ఆవశ్యకతను గురించి తెలుపుతూ విద్యార్థులు మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు చట్టాలపై అవగాహన కలిగి ఉండి సామాజిక కార్యక్రమంలో ముందుండాలని తెలిపారు. విద్యార్థుల పట్టుదలతో చదివి లక్ష్యాన్ని సాధించాలన్నారు.
అనంతరం కళాశాల రాజనీతి శాస్త అధ్యాపకురాలు శ్రీమతి టి. నిర్మల దేవి గారు మాట్లాడుతూ రాజ్యాంగం నిర్మాణంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి యొక్క కృషిని తెలుపుతూ ప్రాథమిక విధులు, ఆదేశిక సూత్రాలు మరియు ఆర్టికల్స్ గురించి వివరించడం జరిగింది.
ఈ కార్యక్రమము ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి శ్రీ డి కరుణాకర్ గారి పర్యవేక్షణలో జరిగినది.
కళాశాల ప్రిన్సిపాల్ మరియు అధ్యాపక బృందం, అధ్యాపకేతర బృందం అందరూ కలిసి కళాశాల రాజాధిశాస్త్ర అధ్యాపకురాలు శ్రీమతి నిర్మల దేవి గారిని శాలువాతో ఘనంగా సన్మానించడం జరిగింది
ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం డి రవీందర్, ఎస్ సదానందం, బి లక్ష్మయ్య, ఎస్ కవిత, జి కవిత, ఆస్మా ఫిర్దోస్, కుమారి ఓ రాణి, లైబ్రేరియన్ బి హిమబిందు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు మరియు విద్యార్థినిలు మొదలగు వారు పాల్గొన్నారు.
- Telangana cabinet decisions – తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
- Intermediate admissions 2026 – ఇంటర్ అడ్మిషన్ల గడువు మరోసారి పెంపు
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
