BIKKI NEWS (SEP. 13) : Colleges will bandh from september 15th in Telangana. తెలంగాణలోని కళాశాలలు ఫీజు బకాయిల కారణంగా నిరవధికంగా బంద్ చేయనున్నారు. 1,200 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించనందుకు తెలంగాణలోని అన్ని ఇంజనీరింగ్, ఫార్మా, MBA, B.Ed, PG & డిగ్రీ కళాశాలలు సెప్టెంబర్ 15 నుండి నిరవధికంగా బంద్ చేయనున్నారు.
Colleges will bandh from september 15th in Telangana.
సెప్టెంబర్ 15ని బ్లాక్ డేగా పాటించనున్నట్లు తెలంగాణ ఉన్నత సంస్థల సంఘాల సమాఖ్య (FATHI) తెలిపింది.
దీనిపై ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య (FATHI) కార్యవర్గం అత్యవసర సమావేశం నిర్వహించి ఈ నిర్ణయం తీసుకుంది.
డిమాండ్లు ఇవే:
- పెండింగ్‌లో ఉన్న అన్ని బకాయిలను వెంటనే విడుదల చేయాలి.
- దసరా నాటికి కనీసం 60% అన్నా విడుదల చేయాలని డిమాండ్.
- అంతే కాకుండా భవిష్యత్తులో సాధారణ ఫీజు రీయింబర్స్మెంట్ కోసం స్పష్టమైన కాలక్రమం రూపొందించాలని డిమాండ్ చేస్తున్నారు.
విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన
ఈ బంద్ కారణంగా విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను పరిష్కరించాలని, విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇంజనీరింగ్, ఫార్మసీ, బీఎడ్, ఎంబీఏ, ఎంసీఏ, లా, నర్సింగ్ వంటి కళాశాలలు ఈ బంద్‌లో పాల్గొననున్నాయి.
- Telangana Anganwadi jobs Vacancies 2026 – నోటిఫికేషన్ లు షురూ, అర్హతలు, ఖాళీల వివరాలు
- Today Gold Rate June 21st 2026 – నేటి బంగారం, వెండి ధరలు
- Today Gold Rate June 20th 2026 – నేటి బంగారం, వెండి ధరలు
- Standard GK bits in Telugu 152 – జనరల్ నాలెడ్జ్ బిట్స్
- Free bus journey – నీట్ విద్యార్థులకు ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం

