BIKKI NEWS (SEP. 09) : Chalo Hyderabad postponed by TGEJAC. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సంజయ్ జాజూ గారు, ఆర్థిక శాఖ కార్యదర్శి శ్రీ సందీప్ సుల్తానియా గారు, GAD కార్యదర్శి శ్రీ మహేష్ దత్ ఎక్కా గారు TGEJAC నాయకత్వంతో ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై చర్చలు జరిపి ఒక అభిప్రాయానికి రావడం జరిగింది.
Chalo Hyderabad postponed by TGEJAC
ఈ నేపథ్యంలో చర్చల్లో ప్రభుత్వం తరఫున ఈ క్రింది అంశాలపై స్పష్టత ఇవ్వడం జరిగింది:
PRC : PRC కమిషన్ తన నివేదికను తక్షణమే ప్రభుత్వానికి సమర్పించేలా LR No.40/CSP/26 ద్వారా ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
CPS రద్దు: : CPS రద్దు అంశంపై కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 01-09-2004 నాటికి నియమితులైన ఉద్యోగుల పెన్షన్ సమస్యపై కూడా కమిటీ నిర్ణయం తీసుకొని తగిన ఆదేశాలు జారీ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
DAలు & పెండింగ్ బిల్లులు : ఈ నెల 18వ తేదీన మరోసారి ప్రభుత్వం–JAC మధ్య చర్చలు నిర్వహించి, DAలు మరియు పెండింగ్ బిల్లులపై నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది.
నాన్-ఫైనాన్షియల్ సమస్యలు: : నాన్-ఫైనాన్షియల్ సమస్యల పరిష్కారం కోసం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ముందుగానే ఎజెండాను అందించి, అదే సమావేశంలో సంబంధిత శాఖల అధికారులతో చర్చించి సమస్యలకు పరిష్కారం చూపుతామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
గౌరవ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి గారు కోరిన మేరకు అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున TGEJAC తో 18 వ తేదీ రోజున జరిగే సమావేశం లో సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కారం చేస్తామని తెలిపిన మేరకు తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని JAC నాయకత్వం తెలుపడం జరిగింది
