BIKKI NEWS (Sep. 07) : Employees and Bhatti meeting on employees issues. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 10న తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమం, అనంతర నిరసన కార్యక్రమాలను వాయిదా వేయాలని ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉద్యోగ సంఘ నేతలతో ఆదివారం చర్చలు జరిపారు.
Employees and Bhatti meeting on employees issues.
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఉద్యోగులు తమ నిరసన కార్యక్రమాలను వాయిదా వేయాలని ఈ సందర్భంగా ఢట్టి ఉద్యోగ సంఘాల నేతలను కోరినట్లు సమాచారం... అయితే తమకు రాతపూర్వక హామీ లభిస్తేనే నిరసన కార్యక్రమాలను వాయిదా వేసే అవకాశం ఉందని స్పష్టం చేసినట్లు సమాచారం.
ఈరోజు సి ఎస్ నుండి పీఆర్సీ ప్రకటన, సిపిఎస్ రద్దు, పెండింగ్ బిల్లుల విషయం, డిఏ ల పై స్పష్టమైన రాతపూర్వక హామీ లభిస్తేనే చలో హైదరాబాద్ మరియు ఇతర నిరసన కార్యక్రమాలను వాయిదా వేసుకునే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘ నాయకులు సోమవారం ఉదయం అత్యవసర సమావేశాలను ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం హామీలపై చర్చించి, నిరసన కార్యక్రమాలపై ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.
ఆర్థిక భారం పడని సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించినట్లు సమాచారం.
మరోవైపు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమకు రెండు సంవత్సరాల గడువు ఇస్తే ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తానని తెలిపిన సంగతి తెలిసిందే.
