BIKKI NEWS (Sep 10) : Telangana employees issues discussion on September 18th . తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీతో బుధవారం ప్రభుత్వ జరిపిన చర్చలు ప్రధానంగా ముగిసాయి దీంతో నేడు చేపట్టనున్న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని వాయిదా వేయడం జరిగింది.
Telangana employees issues discussion on September 18th
ప్రభుత్వం నుండి స్పష్టమైన లిఖితపూర్వక హామీ లభించడంతో ఉద్యోగ సంఘాల జేఏసీ చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని వాయిదా తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపాయి.
సెప్టెంబర్ 18న ప్రభుత్వం మరోసారి చర్చలు జరిపి పెండింగ్ డిఏలు, బిల్లుల విషయంలో స్పష్టత తీసుకురానుంది. అలాగే పిఆర్సి కమిటీ నివేదికను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి ఆర్ సి కమిటీ చైర్మన్ శివశంకర్ కు లేఖ రాయడం జరిగింది. అలాగే నూతన పెన్షన్ విధానాన్ని పాత పెన్షన్ విధానంలోకి మార్చుటకు కమిటీని ఏర్పాటు చేయడానికి అంగీకరించారు.
సెప్టెంబర్ 18వ తేదీన ప్రభుత్వం తమ హామీలను నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. ప్రభుత్వం తమ హామీలు నిలబెట్టుకోకుంటే 19 నుండి నూతన కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు.
