జీజేసీ చిట్యాలలో మాదక ద్రవ్యాల నివారణ కోసం ప్రతిజ్ఞ

BIKK NEWS (JUNE 13) : Anti drugs pledge conducted in gjc chityal.. చిట్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వారిచే మాదక ద్రవ్యాల నివారణ కోసం ప్రతిజ్ఞ చేయడం జరిగింది.

Anti drugs pledge conducted in gjc chityal

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ జస్టిక్ అండ్ ఎంపవర్మెంట్ ఆదేశానుసారము Nasha Mukt Bharat అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ యుగంధర్ అధ్యక్షతన మాదకద్రవ్యాల నివారణ కోసం ప్రతిజ్ఞ చేశారు.

ఈ కార్యక్రమంలో చిట్యాల పోలీస్ కానిస్టేబుల్స్ జానీ క్రాంతి కుమార్ పాల్గొని విద్యార్థులకు మరక ద్రవ్యాల వినియోగం ఆరోగ్యానికి హానికరమని అదే విధంగా బైక్ లపై డ్రైవ్ చేయరాదని ఎవరైనా మాదకద్రవ్యాలు తీసుకున్నట్లయితే వారికి సమాచారం ఇవ్వాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ప్రిన్సిపల్ కర్నాజి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ఎం యుగంధర్, లెక్చరర్లు తిరుమల రావు, శ్రీనివాస్, రమేష్, ఉమాదేవి, ఉమా, బాలకృష్ణ, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.