మహబూబాబాద్ (ఏప్రిల్ 06) : A new building must be sanctioned for GJC Mahabubabad Boys College. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలకు నూతన భవనాన్ని & అదనపు తరగతి గదులను వెంటనే మంజూరు చేయాలని టిగ్లా (తెలంగాణ ఇంటర్మీడియట్ గవర్నమెంట్ లెక్చరర్స్ అసోసియేషన్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నయీమ్ పాషా ఇంటర్ విద్య కమిషనర్ శ్రీ కృష్ణ ఆదిత్య గారికి సోమవారం మెయిల్ ద్వారా వినతి పత్రాన్ని పంపించడం జరిగింది.
A new building must be sanctioned for GJC Mahabubabad Boys College
దాదాపు 270 మంది విద్యార్థులు చదువుతున్న కళాశాలలో ఏడు కోర్సులు ఉన్నాయని, మొదటి మరియు ద్వితీయ సంవత్సరానికి మొత్తం 27 గదుల అవసరముండగా పక్కా భవనంలోని నాలుగు గదుల్లో తరగతులు జరుగుతున్నాయని మిగిలిన తరగతులు, ప్రయోగ తరగతులు గత్యంతరం లేని పరిస్థితుల్లో పాత షెడ్లలో, పాత భవంతుల్లో జరుగుతున్నాయని, వర్షాకాలంలో కళాశాల పరిస్థితి మరింత దిగజారుతుందని తెలిపారు.
పాత భవనం కురుస్తుందని వర్షపు నీరంతా కళాశాల ఆవరణలో చేరి చెరువుని తలపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీని ప్రభావం విద్యార్థుల హాజరు శాతంపై, అడ్మిషన్లపై పడుతుందని తెలియజేశారు.
రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు అదనపు తరగతులు నిర్మాణం కొరకు & మరమ్మత్తుల కొరకు లక్షల రూపాయలు మంజూరు అయ్యాయి.. కానీ ఈ కళాశాలకు ఎటువంటి నిధులు ఇప్పటివరకు మంజూరు కాలేదని తెలియజేశారు.
స్థానిక ప్రజా ప్రతినిధులు, పూర్వ విద్యార్థులు చొరవ చూపి ఈ కళాశాలకు నూతన భవనo వెంటనే మంజూరు అయ్యేలా చూసి ఈ కళాశాలకు పూర్వవైభవాన్ని తీసుకురావాలని నయీమ్ పాష కోరారు.

