Food adulteration act

Food Adulteration – ఆహార కల్తీ నివారణకు హైడ్రా తరహ సంస్థ – సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ (మార్చి 30) : A HYDRA-style Organization for Preventing Food Adulteration. ఆహార కల్తీని నియంత్రించడానికి రాష్ట్రంలో ఒక ప్రత్యేక వ్యవస్థను తీసుకొస్తామని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొత్తగా తీసుకొచ్చిన ఈగల్, హైడ్రా తరహాలోనే ఆహార కల్తీని నియంత్రించడానికి కూడా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకోసం దేశంలో ప్రస్తుతం అమలవుతున్న కల్తీ నిరోధక చట్టాలను అధ్యయనం చేసి పటిష్టమైన చర్యలు చేపడుతామని చెప్పారు.

A HYDRA-style Organization for Preventing Food Adulteration

రాష్ట్రంలో 3.39 కోట్ల మందికి పంపిణీ చేస్తున్న సన్నబియ్యం పథకం ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులకు శాసనసభ సెంట్రల్ హాలులో సన్నబియ్యంతో భోజనం ఏర్పాటు చేశారు.

ముఖ్యమంత్రి గారితో పాటు మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు, నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో పాటు మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొని భోజనం చేశారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మీడియాతో ముచ్చటిస్తూ.. “రేషన్ షాపుల ద్వారా దొడ్డుబియ్యం అందించినా తినేవారు లేకపోవడంతో ఆ బియ్యాన్ని సన్నబియ్యంగా మార్చే మాఫియా పెరిగిపోయింది. పైగా దొడ్డు బియ్యం ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి ఖర్చు తప్ప పేదలకు ఉపయోగపడటం లేదు. అన్ని రకాలుగా ఆలోచనలు చేసిన తర్వాత పేదలు తినగలిగే సన్నబియ్యం అందించాలని ఈ పథకాన్ని ప్రారంభించాం.

ఇందుకోసమే క్వింటాలుకు 500 రూపాయల బోనస్ ప్రకటించి సన్నవడ్లు పండించాలని రైతులను ప్రోత్సహించాం. అడిగిన ప్రతి వారికి రేషన్ కార్డు జారీ చేశాం. ఇదే తరహాలో రాష్ట్రంలో విద్యార్థులకు నాణ్యమైన విద్య, పోషకాహారం అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ క్రమంలో పంట మార్పిడి విధానాలపై రైతుల్లో అవగాహన కల్పిస్తాం. వాణిజ్య ఇతర పంటల వైపు రైతులను ప్రోత్సహిస్తాం..” అని ముఖ్యమంత్రి గారు అన్నారు.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →