- BIKKI NEWS : 26-01-2026
gallantry awards list in telugu. భారతదేశం అన్ని రకాల ర్యాంకింగ్ లు కలిగిన సైనికులకు (ఆర్మీ, నావీ, ఎయిర్ పోర్స్) యుద్ధం, శాంతి సమయాలలో అత్యున్నత దైర్య సహసాలు చూపించినందుకు జనవరి 26 మరియు ఆగస్టు 15 న గ్యాలంటరీ అవార్డులను రాష్ట్రపతి అందిస్తారు.
Gallantry Awards list in telugu
యుద్ధ సందర్భంగా :-
- భారత దేశ సైనికులకు ఇచ్చే అత్యున్నత గ్యాలంటరీ అవార్డు : పరమవీర చక్ర
- 2వ అత్యున్నత గ్యాలంటరీ అవార్డు : మహావీర చక్ర
- 3వ అత్యున్నత గ్యాలంటరీ అవార్డు : వీరచక్ర
శాంతి సందర్భంగా :
- 1వ అత్యున్నత గ్యాలంటరీ అవార్డు : అశోక చక్ర (4వ)
- 2వ అత్యున్నత గ్యాలంటరీ అవార్డు : కీర్తి చక్ర(5వ)
- 3వ అత్యున్నత గ్యాలంటరీ అవార్డు : శౌర్య చక్ర (6వ)
యుద్ధ సమయంలో అత్యున్నత పురష్కారాలు :-
పరమవీరచక్ర :- ఇది భారత్ లో అత్యున్నత సైనిక పురస్కారం. కాంస్యంతో వృత్తాకారంలో తయారు చేయబడిన ధైర్యసాహసాలకిచ్చే అత్యుత్తమ భారతీయ అవార్డు పరమవీరచక్ర అవార్డును ఊదారంగు రిబ్బన్లో అలంకరిస్తారు.
ఇంద్రుడి వజ్రాయుధాన్ని పోలిన ఆయుధాలు 4 వైపులా ఉండి మధ్యలో జాతీయ చిహ్నాన్ని కలిగి ఉండే అవార్డు. పరమవీరచక్ర అవార్డు పొందిన మొదటివ్యక్తి – మేజర్ సోమనాధశర్మ(1947 నవంబర్ 3)
మహావీరచక్ర :- ఈ అవార్డును వెండితో తయారు చేస్తారు. – ఈ అవార్డును సగం తెలుపు, సగం నారిజరంగు గల రిబ్బన్ తో అలంకరిస్తారు.
వీర్ చక్ర :- ఈ అవార్డుకు మధ్యలో అశోక చక్రం ఉంటుంది. ఈ అవార్డును కూడా వెండితో తయారు చేస్తారు.
శాంతి సమయంలో ఇచ్చే అత్యున్నత పురష్కారాలు :
అశోక చక్ర :– యుద్ధం జరగని సమయంలో, శాంతి సమయంలో అత్యున్నత ధైర్యసాహసాలు ప్రదర్శించిన వారికి ఇస్తారు.
అశోక చక్ర అవార్డును పచ్చటి సిల్కు రిబ్బన్ లో అలంకరిస్తారు. ఈ అవార్డు పొందిన తొలి మహిళ : కమలేష్ కుమారి. అవార్డు మధ్యలో అశోక చక్రం ఉంటుంది గిట్టు బంగారంతో చేసిన జ్ఞాపికను ఇచ్చే అవార్డు.
కీర్తి చక్ర, శౌర్యచక్ర :- ఈ అవార్డులను అశోక చక్ర అవార్డు వలె పచ్చటి సిల్కు రిబ్బన్ లో అలంకరిస్తారు.
- Today Gold Rate September 29th 2026 – మళ్ళీ భారీగా తగ్గిన బంగారం ధర
- Crop Insurance – యాసంగికి ముందు పంటల బీమా.. రైతులకు ప్రభుత్వం గుడ్న్యూస్
- Rajiv Yuva Vikasam – నవంబరులో రాజీవ్ యువ వికాసం.. విద్యార్థుల ఖాతాల్లో రూ.450 కోట్ల బోధన ఫీజులు
- Assam Rifles Recruitment 2026: 354 టెక్నికల్, ట్రేడ్స్మన్ ఉద్యోగాలు
- Standard GK bits in Telugu part 179 – జీకే బిట్స్

