Districts reorganization in telangana says CM revanth. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
districts reorganization in telangana says cm revanth
గత ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణలో పారదర్శకత పాటించలేదని, అస్తవ్యస్తంగా ఇష్టమొచ్చినట్లు జిల్లాలో పెంపు చేపట్టిందని టీజీవోస్ క్యాలెండర్ ఆవిష్కరణ సభలో వ్యాఖ్యానించారు.

మండలాలు, జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనేది జనాభా ప్రాతిపదికన చేపట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఇందుకోసం కమిషన్ ఏర్పాటు చేసి, ప్రజల నుండి అభ్యంతరాలను, సూచనలను స్వీకరించి వచ్చే శాసనసభ బడ్జెట్ సమావేశాలలో దీనిపై కూలంకషంగా చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
ఒక్కో జిల్లాలో భారీగా జనాభా ఉందని మరికొన్నిటిలో తక్కువ జనాభా ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
జిల్లాలు, మండలాల సంఖ్యను పెంచడం, తగ్గించడం మీద కాకుండా జనాభా పరంగా సమానంగా ఉండేలా పునర్వ్యవస్థీకరణ చేపట్టడంపైనే తమ దృష్టి ఉందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తెలియజేశారు.
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
- Today in history August 7th – చరిత్రలో ఈరోజు ఆగస్టు 07.
