BIKKI NEWS (MAR 25) : 20% discount on EVs for Telangana government employees. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు పై 20% డిస్కౌంట్ ఇవ్వనుంది. ఈ మేరకు జీవో 41 తో కీలక నిర్ణయాలు తీసుకుంది.
20% discount on EVs for Telangana government employees
పర్యావరణ పరిరక్షణ మరియు కాలుష్య నివారణే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల (Electric Vehicles) వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వ ఉద్యోగులకు 10 నుండి 20 శాతం రాయితీ (Discount) ఇప్పించనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు.
ఉద్యోగులకు బంపర్ ఆఫర్
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఎలక్ట్రిక్ టూ వీలర్ లేదా ఫోర్ వీలర్ కొనుగోలు చేయాలనుకుంటే, వారికి వాహన ధరలో 20 శాతం వరకు డిస్కౌంట్ ఇచ్చేలా తయారీ కంపెనీలతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. ఈ నిర్ణయం వల్ల వేలాది మంది ఉద్యోగులకు ఆర్థికంగా భారీ ఊరట కలగనుంది.
జీవో 41 (GO 41) – ఈవీ పాలసీ ముఖ్యాంశాలు:
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త ఈవీ పాలసీ ద్వారా వాహనదారులకు అనేక ప్రయోజనాలు కలుగుతున్నాయి:
రోడ్డు టాక్స్ మినహాయింపు: ఎలక్ట్రిక్ వాహనాలపై 100% రోడ్డు టాక్స్ (Road Tax) రద్దు.
రిజిస్ట్రేషన్ ఫీజు లేదు: కొత్త ఈవీల రిజిస్ట్రేషన్ సమయంలో ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు: కలెక్టరేట్లు, విద్యా సంస్థలు, పర్యాటక కేంద్రాలు మరియు గేటెడ్ కమ్యూనిటీల్లో భారీగా ఛార్జింగ్ పాయింట్ల ఏర్పాటు.
ఆర్టీసీలో ఈవీ బస్సులు: త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా 2,800 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నారు.
Also Read…
• తాజా విద్యా సమాచారం
• తాజా జాబ్ నోటిఫికేషన్స్
• ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
• కరెంట్ అఫైర్స్
• జీకే బిట్స్
• ఎంప్లాయిస్ న్యూస్
మంత్రి పొన్నం ప్రభాకర్ ఏమన్నారంటే.?
“హైదరాబాద్ నగరం మరో ఢిల్లీలా మారకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈవీ పాలసీ వల్ల ప్రభుత్వానికి 900 కోట్ల రూపాయల ఆదాయం తగ్గినప్పటికీ, భవిష్యత్ తరాల కోసం పర్యావరణాన్ని కాపాడటం మా బాధ్యత. ప్రభుత్వ శాఖల్లో కూడా 25% నుండి 50% వాహనాలను ఈవీలుగా మార్చే ప్రక్రియ మొదలైంది,” అని మంత్రి స్పష్టం చేశారు.
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
- Hyderabad district Anganwadi jobs notification – హైదరాబాద్ జిల్లాలో 181 అంగన్వాడి జాబ్స్
