ప్రజా పాలన సంబరాలలో ఉద్యోగులకు భాగస్వామ్యం కల్పించండి - bikki news

ప్రజా పాలన సంబరాలలో ఉద్యోగులకు భాగస్వామ్యం కల్పించండి

BIKKI NEWS (NOV. 01) : TGOS DEMANDING FOR EMPLOYEES PENDING ISSUES. రాబోయే ప్రజాపాలన సంబురాలు డిసెంబర్ 9 నుంచి ప్రారంభం కానున్న నేపథ్య‌లో, ఎన్నికల‌కు ముందు ప్రభుత్వ ఉద్యోగీలకు ఇచ్చిన హామీల‌ను అమలు చేయాలని తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ (TGEJAC) రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతుంది.

TGOS DEMANDING FOR EMPLOYEES PENDING ISSUES

TG EJAC ప్రభుత్వం దృష్టికి ఈ క్రింది ప్రధాన డిమాండ్లను తీసుకువెళ్తుంది:

డీఏ విడుదల: ప్రభుత్వము ప్రతి ఆరు నెలలకొకసారి డీఏ విడుదల చేస్తామ‌ని హామీ ఇచ్చినప్పటికీ, ప్రభుత్వం లిఖిత పూర్వకంగా ఇచ్చిన 64 హామీల మేరకు విడుదల చేసిన ప్రభుత్వ ఉత్తర్వులు నెం.78 జూన్ 13 వ తేదిన విడుదల చేసిన ఉత్తర్వులను అనుసరించి మంజూరై పెండింగ్‌లో ఉన్న డీఏ ను ప్రజాపాలన సంబురాల‌కు ముందుగా విడుదల చేసి తమను సైతం సంబురాలలో భాగస్వామ్యం చేయాలని TGEJAC రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతోంది.

ఉద్యోగుల ఆరోగ్య కార్డుల మంజూరు: ఉద్యోగుల ఆరోగ్య కార్డులపై మంత్రివర్గ ఉపసమితి ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. దీన్నీ వెంటనే అమలు చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పలు మార్లు తమతో జరిపిన సమావేశాలలో చెబుతున్నప్పటికీ అమలు కావడం లేదు .దీనివల్ల ఉద్యోగులు పెన్షనర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు . EHS స్కీం వెంటనే అమలు చేసి, ఉద్యోగులు మరియు పెన్షనర్లకు వైద్య సేవలు అందించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని TGEJAC విజ్ఞప్తి చేస్తుంది.

పెండింగ్ బిల్లుల విడుదల: ప్రభుత్వం ఇటీవల పెండింగ్ బిల్లులపై ₹700 కోట్లు విడుదల చేసినప్పటికీ, వాస్తవ అవసరం ₹1,500 కోట్లుపైగా ఉంది . రాష్ట్రంలో నెలకు సగటున 600 మంది ఉద్యోగులు రిటైర్ అవుతుండటంతో బకాయిలు భారీగా పేరుకుపోతున్నాయి. మిగిలిన మొత్తం విడుదల చేసి రిటైర్డ్ ఉద్యోగులు, వారి కుటుంబాలు ఇబ్బందులు పడకుండా చూడాలని TGEJAC కోరుతోంది.

2010 సంవత్సరం కంటే ముందుగా నియామకమైన ప్రభుత్వ ఉపాధ్యాయులందరికి TET అర్హత పరీక్ష తప్పనిసరిగా పాస్ కావాలన్న నిబంధననుండి మినహాయించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో తీర్మానాన్ని ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని కోరారు.

ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీలను 9 డిసెంబర్‌కు ముందుగానే ఈ సమస్యలను పరిష్కరించాలని TGEJAC ప్రభుత్వాన్ని కోరుతోంది. ఇలా చేయడం ఉద్యోగుల్లో నమ్మకాన్ని పెంపొందించడమే కాకుండా, ప్రభుత్వం–ఉద్యోగుల సంబంధాలు మరింత బలపడేలా చేస్తుంది.

ఈ కార్యక్రమములో పాల్గొన్నవారు: పుల్గం దామోదర్ రెడ్డి, వెంకట్ , సదానంద్ గౌడ్, వంగ రవీందర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, ముజీబ్ హుస్సేన్, ఎ. సత్యనారాయణ, వెంకట్, దామోదర్ రెడ్డి, తిప్పర్తి యాదయ్య, లింగారెడ్డి, కస్తూరి వెంకటేశ్వర్లు, దాస్య నాయక్, అనిల్‌కుమార్, బి. శ్యామ్, కృష్ణయాదవ్, డాక్టర్ రామారావు, శ్రీకాంత్, కటకం రమేష్ ,షౌకత్ హుస్సేన్, శిరీష, మోహన్ నారాయణ

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →