- 7 లక్షల 60 వేల రూ.ల చెక్కును కలెక్టర్ కు అందచేసిన తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం.
BIKKI NEWS (OCT. 23) : TGO Mahabubnagar donates 7.60 lakhs to collector. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం, కేంద్ర సంఘ ఉపాధ్యక్షులు మాచర్ల రామకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో గౌరవ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో విద్యా నిధికి 27 ప్రభుత్వ శాఖల అధికారులు నుండి సేకరించిన 7 లక్షల 60 వేల రూపాయల విలువైన చెక్కును మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయేందిర బోయి కి అందజేశారు.
TGO Mahabubnagar donates 7.60 lakhs to collector
అలాగే ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ తన మొదటి నెల జీతం లక్ష రూపాయల చెక్కును కలెక్టర్ కు అందజేశారు.

అనంతరం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి పాత్రికేయులతో మాట్లాడుతూ… ఈ సంవత్సరం జనవరిలో మంచి ఆలోచనతో ప్రారంభించిన మహబూబ్ నగర్ విద్యా నిధి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలువురిని ఆలోచింపజేస్తుంది అన్నారు. ఇప్పుడు రాష్ట్రం మొత్తం మన మహబూబ్ నగర్ వైపే చూస్తుందన్నారు. విద్యా నిధి వల్ల వచ్చే ప్రతి రూపాయి కూడా పేద విద్యార్థుల విద్య కోసం ఖర్చు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. విద్యా నిధి కి వచ్చిన విరాళాల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ హాస్టల్స్ లలో చదువుతున్న విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు అందిస్తామని ఆయన తెలిపారు. విద్యార్థులకు ఉపయోగపడే విధంగా డిజిటల్ లెర్నింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని, మొదటగా నియోజకవర్గంలో 25 డిజిటల్ లెర్నింగ్ సెంటర్లు ప్రారంభిస్తున్నామని ఆయన చెప్పారు.
మహబూబ్ నగర్ ను ఎడ్యుకేషనల్ హబ్ గా అభివృద్ధి చేయాలనే చిత్తశుద్ది పట్టుదల ఉంది కాబట్టి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి యొక్క సహకారంతో, మా అందరి కృషి తో మూడు ఇంజనీరింగ్ కళాశాలలను మహబూబ్ నగర్ కు తీసుకు వచ్చామని ఆయన చెప్పారు. మహబూబ్ నగర్ నియోజకవర్గం లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించడానికి శత శాతం అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని, 32 మంది విద్యా వాలంటీర్లు ను నియమించి వారి ద్వారా విద్యార్థులకు తర్ఫీదు ఇవ్వడం జరుగుతుందని ఆయన చెప్పారు.
మహబూబ్ నగర్ లోని మూడు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు ఎప్సెట్ మరియు నీట్ ఎంట్రెన్స్ టెస్ట్ కోసం శిక్షణ ఏర్పాటు చేశామని గత సంవత్సరం అద్భుతమైన ఫలితాలు వచ్చాయని ఆయన చెప్పారు. పదవతరగతి పూర్తి చేసిన విద్యార్థులకు పాలిటిక్నిక్ ఎంట్రెన్స్ టెస్ట్ కు శిక్షణ ఇప్పించడం జరిగిందని ఆయన తెలిపారు. భవిష్యత్తు లో మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. సామాజిక బాధ్యతగా భావించి విద్యా నిధికి విరాళాలు ఇచ్చిన టిజివో ప్రతినిధులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
టి.జి.ఓ కేంద్ర సంఘ ఉపాధ్యక్షులు మాచర్ల రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ… టి.జి.ఓ తరపున తమ వంతుగా మంచి సంకల్పంతో శాసన సభ్యులు విద్య అభివృద్ధికి ఏర్పాటు చేసిన విద్యానిధికి తమ వంతుగా 7,60,000 రూ.ల చెక్కును అంద చేసినట్లు తెలిపారు.
ఇంటర్మీడియట్ విద్య నుండి లెక్చరర్లు, ప్రిన్సిపాల్ లు 2,50,000 రూపాయలు,ఇరిగేషన్ శాఖ నుండి అధికారులు 1,25,000 రూ.లు, వైద్య ఆరోగ్య శాఖ నుండి 87,000 రూ.లు, మిషన్ భగీరథ నుండీ 81,000 రూ.లు, వెటర్నరీ శాఖ నుండి 50,000 రూ.లు, వ్యవసాయ శాఖ నుండి 40,000 రూ లు,సహకార శాఖ నుండి 16,000 రూ లు అందించారు.
ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టి.జి. ఓ) కేంద్ర సంఘ ఉపాధ్యక్షులు మాచర్ల రామకృష్ణ గౌడ్, టి.జి. ఓ జిల్లా అధ్యక్షులు ఎస్.విజయ్ కుమార్, కార్యదర్శి వర ప్రసాద్, ట్రెజరర్ టైటస్ పాల్, ఉపాధ్యక్షులు శ్రీను గౌడ్, డా. శశి కాంత్, జిల్లా ట్రెజరీ అధికారి శ్రీనివాస్, జిల్లా పశు సంవర్థక శాఖ అధికారి మధుసూదన్ గౌడ్, వైస్ ప్రెసిడెంట్ శివరాజ్, రామ్ పాల్, తానాజీ, నరేష్ కుమార్, కరణం రాజు, నాగరాజు, ఇమ్రాన్, డి.పి.ఆర్. ఓ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
- Today in history August 7th – చరిత్రలో ఈరోజు ఆగస్టు 07.
