TG cabinet meeting – అక్టోబర్ 1న తెలంగాణ మంత్రివర్గ సమావేశం

Tg cabinet meeting on october 1st 2026

BIKKI NEWS (SEP. 25) : TG cabinet meeting on October 1st 2026. తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి అధ్యక్షతన అక్టోబర్ 1న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

TG cabinet meeting on October 1st 2026

పలు అంశాలపై కేబినెట్‌లో చర్చ

రాష్ట్రంలో అమలు చేయాల్సిన వివిధ కార్యక్రమాలు, పరిపాలనాపరమైన అంశాలతో పాటు పలు శాఖల్లో కొత్త పోస్టుల మంజూరు, ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా ఉద్యోగాల భర్తీ వంటి అంశాలు మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.

అదేవిధంగా పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా భూముల కేటాయింపు, కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతిపాదనలు, వివిధ శాఖలు సమర్పించిన ప్రతిపాదనలపై కూడా కేబినెట్‌ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.

2 డీఏ లకు ఆమోదం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు రెండు డిఏలు విడుదల చేయడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

కొత్త పోస్టులపై ఆసక్తి

పలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు, అదనపు సిబ్బంది అవసరాలపై ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధమైన నేపథ్యంలో కొత్త పోస్టుల మంజూరుపై ఉద్యోగార్థుల్లో ఆసక్తి నెలకొంది. అయితే ఎన్ని పోస్టులకు ఆమోదం లభిస్తుంది, ఏ శాఖల్లో పోస్టులు మంజూరు చేస్తారనే అంశంపై అధికారిక నిర్ణయం వెలువడాల్సి ఉంది.

కీలక నిర్ణయాలపై ఉత్కంఠ

మంత్రివర్గ సమావేశంలో చర్చించే అంశాలపై అధికారిక అజెండా పూర్తిగా వెల్లడైన తర్వాత మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కేబినెట్‌ ఆమోదం అనంతరం సంబంధిత శాఖలు ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంటుంది.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →