Chalo hyderabad programme on september 10th by employees.

Chalo Hyderabad – చలో హైదరాబాద్ యాధాతధం

BIKKI NEWS (Sep. 08) : Chalo Hyderabad programme on September 10th by Employees. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ తమ డిమాండ్ల సాధన కొరకు సెప్టెంబర్ 10న తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమం యధావిధిగా నిర్వహిస్తామని జేఏసీ ప్రకటించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా లక్ష మంది ఉద్యోగులతో హైదరాబాదులో కార్యక్రమం సెప్టెంబర్ 10న నిర్వహించనున్నారు.

Chalo Hyderabad programme on September 10th by Employees.

అసెంబ్లీకి సమావేశాల నేపథ్యంలో నిరసన కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని భట్టి విక్రమార్క చేసిన విజ్ఞప్తి నేపథ్యంలో లిఖితపూర్వక హామీని ఉద్యోగ సంఘాలు కోరిన సంగతి తెలిసిందే.

ఆదివారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో ఉద్యోగ సంఘాలు జేఏసి నిర్వహించిన చర్చలలో తమకు లిఖితపూర్వక హామీ కావాలని కోరగా ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని యధావిధిగా నిర్వహించాలని జేఏసీ సోమవారం అత్యవసర సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంది.

రెండో పి ఆర్ సి ప్రకటన, పాత పెన్షన్ పద్ధతి పునరుద్ధరణ , పెండింగ్ బిల్లులు, డీఏలు విడుదల, ఎంప్లాయిస్ హెల్త్ స్కీం వంటి పలు అంశాలపై ఉద్యోగ సంఘాలు తమ నిరసన తెలుపనున్నాయి

చలో హైదరాబాద్ కార్యక్రమానికి లచ్చిరెడ్డి జేఏసీ కూడా మద్దతు తెలపడం కీలక పరిణామం.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →