BIKKI NEWS (MAY 24) : Mid day meals in GJCs. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుండి ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనాలను అందజేయాలని మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది.
Mid day meals in GJCs
మే 23న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన మంత్రి మండలి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకానికి ఆమోదం ముద్ర వేసింది.
బడుగు బలహీన పేద వర్గాలకు చెందిన పేద విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యనుభ్యసిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ పాఠశాలల మాదిరిగానే జూనియర్ కళాశాలల్లో కూడా మధ్యాహ్న భోజనం పథకం మరియు ఉదయం అల్పాహార పథకం ఈ విద్యా సంవత్సరం నుండి అమలు కానుంది.
