BIKKI NEWS (MAY 23) : Today Telangana cabinet meeting on key issues. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సాయంత్రం.మ 4 .00 గంటలకు సచివాలయంలో కేబినెట్ భేటీ జరగనుంది.
Today Telangana cabinet meeting on key issues.
ఈ భేటీ లో పొదుపు చర్యలు, విద్యుత్ సంస్కరణలపై కీలక చర్చ జరుగనుంది. డిస్కంల నష్టాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
జూన్ 2 నుంచి రైతు డిస్కం అమలుపై మంత్రి మండలి కీలక నిర్ణయం తీసుకోనుంది.
అలాగే పంప్‌సెట్లకు ప్రోత్సాహంపై చర్చించనున్న కేబినెట్. కొండారెడ్డిపల్లి తరహాలో మరికొన్ని సోలార్ విలేజెస్, సోలార్ స్టౌ స్కీం అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
విద్యుత్, పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గింపుపై చర్చ, ప్రభుత్వ శాఖల్లో ఈవీల వినియోగంపై కీలక నిర్ణయం తీసుకోనున్న తెలంగాణ కేబినెట్.
పంటల మార్పిడి దిశగా రైతులకు యాక్షన్ ప్లాన్, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా విధివిధానాల ఖరారు, రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, తెలంగాణ ఆవిర్భావ వేడుకల నిర్వహణపై చర్చ జరగనుంది.
అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అల్పాహారం, మధ్యాహ్న భోజనం పథకం అమలుపై కూడా చర్చ జరగనున్నట్లు సమాచారం.
