హైదరాబాద్ (మే 19) : Inter exams May 19th report . తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TGBIE) నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ప్రధాన పరీక్షలు (IPASE May 2026) ప్రశాంతంగా ముగిశాయి.
Inter exams May 19th report
ఈరోజు ఉదయం సెషన్‌లో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు కెమిస్ట్రీ-I, కామర్స్-I పరీక్షలు జరగ్గా.. మధ్యాహ్నం సెషన్‌లో రెండో సంవత్సరం విద్యార్థులకు కెమిస్ట్రీ-II, కామర్స్-II పరీక్షలు నిర్వహించారు. రెండు సెషన్లలోనూ “SET – A” ప్రశ్నాపత్రాన్ని ఉపయోగించినట్లు బోర్డు తెలిపింది.
తొలిరోజు ఉదయం జరిగిన మొదటి సంవత్సరం పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు. 90.76% హాజరయ్యారు. ఖమ్మం జిల్లాలో 2 మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి.
మధ్యాహ్నం జరిగిన రెండో సంవత్సరం పరీక్షలకు 90.07% మంది విద్యార్థులు హాజరైనారు. ఎక్కడా ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదు
జిల్లాల్లో ప్రత్యేక పర్యవేక్షణ
పరీక్షలు పారదర్శకంగా, ఎలాంటి అక్రమాలకు తావులేకుండా నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. నిర్మల్, ఆదిలాబాద్, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లోని పరీక్షా కేంద్రాలను పర్యవేక్షించేందుకు ఇంటర్మీడియట్ బోర్డు నుండి ప్రత్యేక అబ్జర్వర్లను (పరిశీలకులను) పంపినట్లు బోర్డు కార్యదర్శి పేర్కొన్నారు.
