BIKKI NEWS (MAY 07) : Intermediate in schools pilot project 2026. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ బదులుగా పాఠశాలల్లోని ప్లస్ టు బోధించే నూతన విధానాన్ని ఈ విద్యాసంవత్సరం నుంచే ప్రారంభించాలని అందుకు సంబంధించి పైలెట్ ప్రాజెక్టుగా 100 పాఠశాలను ఎంపిక చేసుకుని అడ్మిషన్లు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Intermediate in schools pilot project 2026.
ఈ మేరకు పైలెట్ ప్రాజెక్టు రూపకల్పన కొరకు అధికారులకు కీలక ఆదేశాలు అందినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోని ప్రకటించిన ఇంటర్మీడియట్ అడ్మిషన్ల షెడ్యూల్ వాయిదా వేసినట్లు సమాచారం.
పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు అదే పాఠశాలలో ప్లస్ టు విద్యా విధానంలోకి నేరుగా అడ్మిషన్లు పొందేలా చర్యలు తీసుకోవాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
అయితే ఈ పైలెట్ ప్రాజెక్టులో భాగంగా 100 పాఠశాలలను ఎంచుకొని వాటిలో ఇంటర్మీడియట్ ప్లస్ టు తరగతులు నిర్వహించేలా చర్యలు తీసుకోవడానికి పాఠశాలల ఎంపిక ప్రక్రియను సత్వరమే చేపట్టాలని ఆదేశాలు జారీ అయినట్లు సమాచారం.
అయితే ప్లస్ టు విద్య బోధన కొరకు సిబ్బందిని డిప్యూటేషన్ మీద తీసుకోవాలా లేదా అదనంగా ఉన్న సిబ్బందిని తీసుకోవాలా అనేదానిమీద ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
ఇంటర్మీడియట్ విద్యా విధానం రద్దుపై విద్యావేత్తలు మరియు ఉద్యోగ సంఘాలు తీవ్రంగా ఆక్షేపణ వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.

