Gjc malkajgiri - ఇంటర్ ఫలితాలలో ప్రభంజనం - bikki news

GJC MALKAJGIRI – ఇంటర్ ఫలితాలలో ప్రభంజనం

మల్కాజిగిరి (ఏప్రిల్ – 12) : GJC MALKAJGIRI GOT BEST RESULTS IN INTERMEDIATE EXAMS 2026. తెలంగాణ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 2026 మార్చి ఫలితాలలో మల్కాజిగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించారు. జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఉమాదేవి గారు మాట్లాడుతూ గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కళాశాల విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో అత్యున్నత ఫలితాలు సాధించగలిగారని అన్నారు.

GJC MALKAJGIRI GOT BEST RESULTS IN INTERMEDIATE EXAMS 2026.

ఈ ఫలితాల వెనకాల అధ్యాపకుల కృషి మరియు విద్యార్థుల పట్టుదల ఎంతో ఉందని కొనియాడారు. జనరల్ మరియు ఒకేషనల్ కోర్సులలో విద్యార్థిని విద్యార్థులు ప్రతిభను కనబరిచారు.

కళాశాల టాపర్స్ గా నిలిచిన నిత్య సత్య నాయుడు బైపిసి సెకండియర్ 1000 కి 986 మార్కులను సాధించారు.

అలాగే ఎంపీసీలో స్వాతి 1000కి 897 మార్కులను,
ముష్ర ఫాతిమా హెచ్ఈసిలో 1000 కి 851,
పి మానస హెచ్ఈసిలో 1000కి 848 మార్కులు,
సుశీల్ కుమార్ 1000కి 848 మార్కులు,
సాయి దుర్గ ఎంఈసి 856/1000 మార్కులను సాధించారు.

మొదటి సంవత్సరం ఫలితాలు

  • బి నిషా సిఈసి 500 కి 401 మార్కులు
  • అలేఖ్య ఎంపీసీ 470కి 447 మార్కులు
  • పి గ్రేస్ బైపిసి 440 కి 436 మార్కులు
  • వైష్ణవి ఎంఈసి 500 కి 471 మార్కులు
  • ఎస్ ఎస్ సాయి విగ్నేష్ 500 కి 491 సాధించారు.

ఒకేషనల్ కోర్సులలో సెకండ్ ఇయర్ విద్యార్థులు.
A. E. T ఎండి ఇఫ్తార్ అహ్మద్ 1000 కి 933, ఈ సి టీ సెకండ్ ఇయర్ మాధవి రత్నం 1000కి 961
C. T. ఆర్యన్ గణేష్ 1000కి 749 మార్కులు సాధించారు.

ఒకేషనల్ ఫస్ట్ ఇయర్ ఫలితాలలో A. E. T. బి సాత్విక్ 500 కి 458 మార్కులు E. C. T జై కళ్యాణి 500 కి 462 మార్కులు, C. T. వెంకట్ 500 కి 380 మార్కులు, సాధించారు.

మొత్తం మొదటి సంవత్సరం విద్యార్థులు 455 కాగా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స విద్యార్థులు 377 మంది హాజరైనారు అత్యధిక మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థిని విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపాల్ గారు, అధ్యాపకులు మరియు అధ్యాపకేతర బృందం అభినందనలు తెలిపారు..

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →