- ఫోరెన్సిక్ ఆడిట్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
- అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీలపై కేసులు నమోదు చేయాలని స్పష్టం
BIKKI NEWS (MAR. 04) : 25 thousand bogus Employees in Telangana. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 25 వేల మంది బోగస్ ఉద్యోగులను ఉన్నట్లుగా చూపించి, నెలనెలా జీతాలు తీసుకున్నట్టు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖకు కఠిన ఆదేశాలు జారీ చేశారు.
25 thousand bogus Employees in Telangana
ఆధార్ లింకేజీతో బయటపడిన మోసం
ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగుల వేతనాలకు ఆధార్ లింకేజీ ప్రక్రియలో ఈ భారీ అక్రమం బయటపడింది. ఉద్యోగుల పేర్లతో జీతాలు డ్రా చేస్తున్నా, వాస్తవానికి ఆ వ్యక్తులు ఉద్యోగంలో లేరని గుర్తించారు. గత పదేళ్లుగా ఈ మోసం కొనసాగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ కుంభకోణం వల్ల ప్రభుత్వ ఖజానాకు కోట్లాది రూపాయల నష్టం జరిగిందని అధికారులు అంచనా వేస్తున్నారు.
అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీలపై కేసులు
బోగస్ ఉద్యోగుల పేర్లతో జీతాలు పొందిన అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీలపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సీఎం స్పష్టంగా ఆదేశించారు. అక్రమాలకు పాల్పడిన వారిని ఏ మాత్రం వదిలిపెట్టబోమని, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఫోరెన్సిక్ ఆడిట్‌కు ఆదేశాలు
ఈ మొత్తం వ్యవహారంపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని ఆర్థిక శాఖకు ఆదేశించారు. అక్రమ చెల్లింపులు ఎలా జరిగాయి? ఎవరెవరు దీనిలో భాగస్వాములయ్యారు? ఎంత మేర నష్టం జరిగింది? అనే అంశాలను లోతుగా పరిశీలించనున్నారు.
లోతైన విచారణకు సిద్ధం
సీఎం రేవంత్ రెడ్డి ఈ ఘటనను అత్యంత గంభీరంగా పరిగణించి, పూర్తి స్థాయి విచారణ జరిపి దోషులను చట్టపరంగా శిక్షించాలనే సంకల్పంతో ఉన్నారు. ప్రభుత్వ నిధుల దుర్వినియోగాన్ని ఏ మాత్రం సహించబోమని స్పష్టం చేశారు.
ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపగా, ప్రజల్లో కూడా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఫోరెన్సిక్ ఆడిట్ అనంతరం మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది.
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
- Today in history August 7th – చరిత్రలో ఈరోజు ఆగస్టు 07.
