BIKKI NEWS (FEB. 23) : TG CABINET APPROVED EMPLOYEES CASHLESS EHS and INSURANCE. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రిమండలి సమావేశం ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం, భద్రతకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉద్యోగులకు పూర్తి భద్రత, భరోసా కల్పించేందుకు రెండు కొత్త పథకాలకు ఆమోదం తెలిపింది.
TG CABINET APPROVED EMPLOYEES CASHLESS EHS and INSURANCE.
EMPLOYEES ACCIDENTAL INSURANCE
దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం ప్రస్తుతం రాష్ట్రంలో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఒక్క రూపాయి ప్రీమియం కూడా చెల్లించకుండా ప్రమాద బీమా పథకం.
ప్రజా ప్రభుత్వం తొలిసారిగా సింగరేణిలో, ట్రాన్స్ కోలో ఉద్యోగ వర్గాలకు ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు అందరికీ ఈ పథకాన్ని విస్తరించింది.
ఉద్యోగులు ఎవరైనా ప్రమాదంలో మరణిస్తే రూ.1.2 కోట్లు బీమా పరిహారం అందుతుంది.
సహజ మరణానికి 60 ఏళ్ల వరకు ఉద్యోగులకు రూ.10 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ ప్రయోజనం అందుతుంది.
రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రభుత్వ కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థల పరిధిలో 5 లక్షల 19 వేల మంది రెగ్యులర్ ఉద్యోగులు, వీరితో పాటు 2 లక్షల 38 వేల మంది పెన్షనర్లు కలిపి మొత్తం 7.57 లక్షల మందికి ఈ ప్రమాద బీమా సౌకర్యం వర్తిస్తుంది.
CASHLESS EMPLOYEES HEALTH SCHEME
దీర్ఘకాలికంగా ప్రభుత్వ ఉద్యోగుల ఎదురుచూస్తున్న ఆరోగ్య భద్రతకు క్యాష్ లెస్ ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ (EHS) అమలుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
3 లక్షల 56 వేల మంది ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగులతో పాటు 2.88 లక్షల మంది పెన్షనర్లు, వారిపై ఆధారపడ్డ కుటుంబ సభ్యులు మొత్తం 17.07 లక్షల మందికి ఈ పధకం వర్తిస్తుంది.
తాజా స్కీమ్ తో ఇకపై ప్రభుత్వ ఉద్యోగులు ఆసుపత్రుల్లో ఒక్క రూపాయి చెల్లించకుండానే వైద్య చికిత్సలు అందుతాయి.
అన్ని ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు 652 ఎంపానెల్ ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఈ పధకం వర్తిస్తుంది.
దీనిపై మొత్తం 1998 రకాల వైద్య చికిత్సలు అందిస్తారు.
రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ఉచిత నాణ్యమైన వైద్యం కోసం ప్రతి ఉద్యోగికి డిజిటల్ హెల్త్ కార్డులను జారీ చేస్తారు.
ఈ పధకానికి ప్రభుత్వ ఉద్యోగులు తమ బేసిక్ పే నుంచి 1.5 శాతం వాటాగా చెల్లిస్తే, అంతే సమాన మొత్తంలో ప్రభుత్వం మ్యాచింగ్ వాటా చెల్లిస్తుంది.
ఏడాదికి ఉద్యోగులు రూ. 528 కోట్లు, అంతే మొత్తంలో ప్రభుత్వ వాటా కలిపి మొత్తంగా రూ.1056 కోట్ల తో క్యాష్ లెస్ ఎంప్లాయి హెల్త్ స్కీమ్ అమలవుతుంది.

