BIKKI NEWS (FEB. 23) : Tele Manas Help line number for intermediate students. తెలంగాణ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 2026 కు హాజరయ్యే విద్యార్థులకు పరీక్షల సమయంలో విద్యార్థులు అనుభవించే ఒత్తిడి, ఆందోళన, మానసిక ఆవేదన వంటి సమస్యలను అధిగమించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా మానసిక ఆరోగ్య సహాయ సేవలను అందుబాటులో ఉంచిందని డైరెక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య తెలిపారు.
Tele Manas Help line number for intermediate students
ప్రభుత్వం అందిస్తున్న సేవలు 24×7 అందుబాటులో ఉండి, నిపుణులైన కౌన్సిలర్లు ద్వారా ఉచిత మానసిక ఆరోగ్య సహాయం అందించబడుతుందని తెలిపారు.
విద్యార్థులు సహాయం కోసం క్రింది నంబర్లను సంప్రదించవచ్చు:
14416
+91 80693 91416
ఎలాంటి సంకోచం లేకుండా సైకాలజిస్ట్, మానసిక నిపుణుల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. పరీక్షల సమయంలో విద్యార్థుల మానసిక ఆరోగ్యం మరియు శ్రేయస్సు అత్యంత ముఖ్యమైనవని బోర్డు కార్యదర్శి శ్రీకృష్ణ ఆదిత్య స్పష్టం చేశారు.

