BIKKI NEWS (SEP. 09) : 40 Thousand teachers without TET in Telangana. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 40 వేల మంది టీచర్లకు టెట్ అర్హత తప్పనిసరి రూపంలో గండం వచ్చింది. తాజాగా సుప్రీంకోర్టు తీర్పు వీరు రెండేండ్లలో టెట్ పాస్ కావాలి.. లేదా టీచర్ ఉద్యోగం వదులుకోవాలి.
40 Thousand teachers without TET in Telangana.
సుప్రీం తీర్పు ప్రకారం టీచర్లంతా రెండేండ్లలోపు టెట్ పాస్కావాల్సిందే. కేవలం ఐదేండ్లలోపు సర్వీస్ ఉన్నవారికి మాత్రమే టెట్ నుంచి మినహా యింపు ఉంది.
ఈ ఐదేండ్లలోపు సర్వీస్ ఉన్న వాళ్లు కూడా పదోన్నతి పొందాలంటే మాత్రం టెట్ పాస్ కావాల్సిందే.
రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖలో 1.07ల క్షల మంది టీచర్లు పనిచేస్తున్నారు. వీరిలో 40 వేల మంది వరకు టీచర్లు టెట్ లేకుండా కొనసాగుతున్నారు.
విద్యాహక్కు చట్టం, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) నిబంధనల ప్రకారం టీచర్ల రిక్రూట్మెంట్ కు సీటెట్, టెట్ అర్హత తప్పనిసరి. టీచర్లకు పదోన్నతులు కల్పించేందుకు సైతం టెట్ తప్పనిసరి అని ఎన్సీటీఈ స్పష్టంచేసింది.
జాతీయంగా 23 ఆగస్టు 2010లో ఎన్సీటీఈ టెట్ను తప్పని సరి చేస్తూ నోటిఫికేషన్ జారీచేసింది. అయితే ఈ నోటిఫికేషన్ కు ముందు రిక్రూట్ అయిన వారికి మాత్రం టెట్ నుంచి మినహాయింపునిచ్చింది. 2014 నవంబర్ 12న పైస్థాయి పదో న్నతులు పొందాలంటే మాత్రం టెట్ తప్పని సరిచేస్తూ మరో నోటిఫికేషన్ ను వెలువరించింది.

