BIKKI NEWS (AUG. 20) : US CANCELLED 6000 VISAs. అమెరికా తాజాగా 6,000 మంది విద్యార్థుల వీసాలను రద్దు చేసింది. వీరిలో 4,000 మంది దేశ చట్టాలను ఉల్లంఘించారని అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది.
US CANCELLED 6000 VISAs
అమెరికాలో ఆ దేశ నిబంధనలను ఉల్లేఖిస్తున్న విద్యార్థులపై అమెరికా కఠిన చర్యలను తీసుకుంటుంది.
దాడులు చేయడం, డ్రంకెన్ డ్రైవ్ మరియు దొంగతనాలు చేయడం వంటి ఆరోపణలు వచ్చిన విద్యార్థుల పైన మరియు ఉగ్రదాడులలో పాలుపంచుకుంటున్న 300 విద్యార్థుల పైన కఠిన చర్య లో భాగంగా వీసాలు రద్దు చేసినట్లు అమెరికా ప్రకటించింది.
అమెరికాలో ఉన్నత విద్య వ్యవస్థ సంస్కరణలలో భాగంగా విద్యార్థులపై కఠిన ఆంక్షలు విధిస్తున్న సంగతి తెలిసిందే.