BIKKI NEWS : Today top news in Telugu March 9th 2026- నేటి ప్రధాన వార్తలు
Today top news in Telugu March 9th 2026
Telangana News
విద్యార్ధినిలకు ఈ స్కూటీలు : కళాశాలలో చదువుతున్న విద్యార్థులక ఎలక్ట్రిక్ స్కూటీలను ఉచితంగా అందించే అంశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు
బడ్జెట్ కసరత్తు: మార్చి 16 నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఆర్థిక శాఖ కసరత్తు ముమ్మరం చేసింది. సంక్షేమ పథకాలకు పెద్దపీట వేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
మహిళా రైతుల ప్రోత్సాహం: రాష్ట్రవ్యాప్తంగా మహిళా రైతులకు రాయితీపై వ్యవసాయ పరికరాలు అందించేలా కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్ మెట్రో విస్తరణ: రెండో దశ మెట్రో విస్తరణ పనులకు సంబంధించి కేంద్రం నుంచి అనుమతులు రావడంతో పనులు వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
A.P. News
మహిళా పారిశ్రామికవేత్తలు: రాష్ట్రంలో 5 లక్షల మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మహిళలే అసలైన ‘ఫైనాన్స్ మినిస్టర్లు’ అని ఆయన కొనియాడారు.
పశ్చిమాసియా నుండి వాపస్: యుద్ధ ఉద్రిక్తతల వల్ల పశ్చిమాసియాలో చిక్కుకుపోయిన 500 మందికి పైగా ఆంధ్రప్రదేశ్ వాసులు సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు.
వైసీపీ విమర్శలు: అభివృద్ధి పనుల విషయంలో ప్రస్తుత ప్రభుత్వం వైఫల్యం చెందిందని మాజీ మంత్రి రోజా విమర్శించారు. జగన్ మళ్లీ సీఎం కావడమే లక్ష్యంగా పని చేస్తామన్నారు.
National News
ఆయిల్ నిల్వలు : భారతదేశంలో 4 వేల కోట్ల లీటర్ల ఆయిల్ నిల్వలు ఉన్నాయని, ఆందోళన చెందవద్దని ప్రభుత్వం ప్రకటించింది.
గ్యాస్ బుకింగ్ నిబంధనలు: దేశంలో గ్యాస్ బుకింగ్ విధానంలో మార్పులు రానున్నాయి. ఇకపై 21 రోజుల వ్యవధిలో ఒకసారి మాత్రమే సిలిండర్ బుక్ చేసుకునేలా కొత్త నిబంధనలు అమలులోకి రానున్నట్లు సమాచారం
రాష్ట్రపతి పర్యటన: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నేడు ఒడిశాలో పర్యటించనున్నారు, అక్కడ పలు విద్యా సంస్థల వార్షికోత్సవాల్లో పాల్గొంటారు.
ఎఫ్‌స్టీన్ ఫైల్స్ : ఎఫ్‌స్టీన్ ఫైల్స్ తో ప్రధాని నరేంద్ర మోడీని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నియంత్రిస్తున్నాడని ఎఐసిసి అధ్యక్షుడు ఖర్ఆగే రోపించారు.
గవర్నర్ల అంశంలో సంస్కరణలు అవసరమని తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ కురియన్ జోసెఫ్ కమిటీ పేర్కొంది.
నేటి నుండి పార్లమెంట్ బడ్జెట్ మలివిడత సమావేశాలు ప్రారంభం కానున్నాయి
International News
అమెరికా ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య దాడులు తీవ్రంగా కొనసాగుతున్నాయి. ఇరాన్ చమరుక్షేత్రాలపై ఇజ్రాయిల్ దాడి చేసింది.
నేపాల్ దేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ భారీ విజయాన్ని సాధించింది . బాలేంద్ర షా త్వరలో ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు.
భారత్ చైనా దేశాలు భాగస్వాములుగా ఉండాలని ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు
Business News
బంగారం, వెండి ధరల పతనం: అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో దేశీయంగా బంగారం మరియు వెండి ధరలు భారీగా తగ్గాయి. వెండి కేజీకి సుమారు రూ. 2.71 లక్షల వద్ద కొనసాగుతోంది.
స్టాక్ మార్కెట్: నేడు ఐటీ మరియు బ్యాంకింగ్ షేర్ల కదలికలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించారు. ముఖ్యంగా రిలయన్స్, హెచ్ఏఎల్ (HAL) షేర్లు లాభాల్లో ఉండే అవకాశం ఉంది. నేటి మార్కెట్ అంచనా
Sports News
చారిత్రాత్మక విజయం: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 విజేతగా భారత్ నిలిచింది. ఫైనల్లో న్యూజిలాండ్‌పై ఘనవిజయం సాధించి మూడోసారి పొట్టి ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది.
టీ20 ప్రపంచకప్ విజేత భారత్: భారత్ టీ20 వరల్డ్ కప్ నెగ్గడంతో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. ఈ టోర్నీలో సంజూ శాంసన్ ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచి అందరి ప్రశంసలు అందుకున్నాడు
ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్: ఫైనల్ వరకు దూసుకెళ్లిన భారత స్టార్ షట్లర్ లక్ష్య సేన్ రన్నరప్‌గా నిలిచి నిరాశపరిచాడు.
ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్ లో భారత మహిళల జట్టు ఓటమిపాలైంది
Education and Job Updates
ఇంటర్ పరీక్షలు : నేడు తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా ఫిజిక్స్ ఎకనామిక్స్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు నిర్వహించనున్నారు
అగ్నివీర్ వాయు ర్యాలీ: ఏపీ మరియు తెలంగాణ యువత కోసం గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో నేటి (మార్చి 9) నుండి అగ్నివీర్ వాయు రిక్రూట్మెంట్ ర్యాలీ ప్రారంభమైంది.
తెలంగాణ రాష్ట్రంలో విడుదల చేసిన అన్ని ప్రవేశ పరీక్షలు 2026 నోటిఫికేషన్లు, దరఖాస్తు చివరి తేదీలు , పరీక్ష తేదీలు, దరఖాస్తు లింకుల కోసం క్లిక్ చేయండి
ICAI CA INTER , FOUNDATION RESULTS 2026 LINK
- Today Gold Rate June 21st 2026 – నేటి బంగారం, వెండి ధరలు
- Today Gold Rate June 20th 2026 – నేటి బంగారం, వెండి ధరలు
- Standard GK bits in Telugu 152 – జనరల్ నాలెడ్జ్ బిట్స్
- Free bus journey – నీట్ విద్యార్థులకు ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం
- Young India Students kit – విద్యా వికాసమే ప్రభుత్వ లక్ష్యం – సీఎం రేవంత్ రెడ్డి

