Today inter exams report - పరీక్షలు ప్రశాంతం - 4 మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు - bikki news

Today inter exams Report – పరీక్షలు ప్రశాంతం – 4 మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు

హైదరాబాద్ (మే 15) : Today Telangana Inter exams report. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి (TGBIE) నిర్వహిస్తోన్న ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ (IPASE) మే 2026 పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. నేడు (మే 15, 2026) జరిగిన మొదటి మరియు రెండవ సంవత్సరం పరీక్షలకు సంబంధించిన అధికారిక గణాంకాలను బోర్డు విడుదల చేసింది. ఈరోజు మొత్తం 4 మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి.

Today Telangana Inter exams report

​నేడు ఉదయం జరిగిన సెషన్‌లో మొదటి సంవత్సరం గణితం (Mathematics-IA), బాటనీ (Botany-I) మరియు పొలిటికల్ సైన్స్ (Political Science-I) పరీక్షలు జరిగాయి. 93.2% మంది విద్యార్థులు హాజరైనారు. ఉదయం సెషన్ లో ​ ఒక్క మాల్‌ ప్రాక్టీస్ కేసు ఖమ్మం జిల్లాలో నమోదైంది

​​మధ్యాహ్నం జరిగిన రెండవ సంవత్సరం గణితం (Mathematics-IIA), బాటనీ (Botany-II) మరియు పొలిటికల్ సైన్స్ (Political Science-II) పరీక్షలక 92.5% మంది హాజరయ్యారు. ఖమ్మం జిల్లాలో మూడు మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి

​పరీక్షల పర్యవేక్షణ కోసం ఇంటర్ బోర్డు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. హైదరాబాద్, యాదాద్రి, జనగామ, సిద్దిపేట, సంగారెడ్డి, వికారాబాద్, నాగర్‌కర్నూల్, వనపర్తి మరియు ఖమ్మం వంటి జిల్లాల్లోని పరీక్షా కేంద్రాలను బోర్డు నుంచి వెళ్లిన అబ్జర్వర్లు (Observers) నిశితంగా తనిఖీ చేశారు.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →