Telangana si notification 2026 - 275 ఎస్‌ఐ పోస్టులకు నోటిఫికేషన్ - bikki news

Telangana SI notification 2026 – 275 ఎస్‌ఐ పోస్టులకు నోటిఫికేషన్

BIKKI NEWS (july 29) : Telangana SI Notification 2026. తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB) 2026 సంవత్సరానికి సబ్ ఇన్‌స్పెక్టర్ (SI), రిజర్వ్ ఎస్ఐ, స్టేషన్ ఫైర్ ఆఫీసర్, డిప్యూటీ జైలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 275 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు బోర్డు ప్రకటించింది.

Telangana SI Notification 2026.

ఆన్‌లైన్ విధానంలో మాత్రమే దరఖాస్తులు స్వీకరించనున్నట్లు స్పష్టం చేసింది. దరఖాస్తుల తేదీలను త్వరలో ప్రత్యేకంగా ప్రకటించనున్నట్లు తెలిపింది.

పోస్టుల వివరాలు

పోస్టుఖాళీలు
SCT Sub Inspector (Civil)148
Reserve SI (AR)14
Reserve SI (SAR CPL-Men)3
Reserve SI (TGSP-Men)12
SI – Telangana Special Protection Force44
Station Fire Officer39
Deputy Jailor (Men)14
Deputy Jailor (Women)1
మొత్తం275

జీతం

  • SI పోస్టులు: ₹42,300 – ₹1,15,270
  • స్టేషన్ ఫైర్ ఆఫీసర్ / డిప్యూటీ జైలర్: ₹38,890 – ₹1,12,510

విద్యార్హత

అభ్యర్థి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. నోటిఫికేషన్ తేదీ నాటికి అర్హత ఉండాలి.

వయోపరిమితి

  • కనీస వయస్సు: 21 సంవత్సరాలు
  • గరిష్ఠ వయస్సు: 25 సంవత్సరాలు
  • ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం యూనిఫాం సర్వీసులకు అదనపు వయో సడలింపు వర్తిస్తుంది.
  • SC, ST, BC, EWS అభ్యర్థులకు 5 సంవత్సరాల వయో సడలింపు కల్పించారు.

ఎంపిక విధానం

అభ్యర్థుల ఎంపిక ఈ కింది దశల్లో జరుగుతుంది.

  • ప్రిలిమినరీ రాత పరీక్ష
  • ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (PMT)
  • ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET)
  • ఫైనల్ రాత పరీక్ష
  • సర్టిఫికెట్ వెరిఫికేషన్
  • మెడికల్ పరీక్ష

ప్రిలిమినరీ పరీక్ష

  • అంకగణితం
  • రీజనింగ్ / మెంటల్ ఎబిలిటీ
  • జనరల్ స్టడీస్

మొత్తం 200 మార్కులు. ప్రశ్నలు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. నెగటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది.

ఫిజికల్ పరీక్ష

పురుషులు

  • 1600 మీటర్ల పరుగు
  • లాంగ్ జంప్
  • షాట్‌పుట్
  • కనీస ఎత్తు: 167.6 సెం.మీ.

మహిళలు

  • 800 మీటర్ల పరుగు
  • లాంగ్ జంప్
  • షాట్‌పుట్
  • కనీస ఎత్తు: 152.5 సెం.మీ.

గిరిజన అభ్యర్థులకు ఎత్తులో ప్రత్యేక సడలింపులు ఉన్నాయి.

దరఖాస్తు విధానం

  • దరఖాస్తులు ఆన్‌లైన్‌లో మాత్రమే స్వీకరిస్తారు.
  • ముందుగా రిజిస్ట్రేషన్ చేసి ఫీజు చెల్లించాలి.
  • అనంతరం Part-I అప్లికేషన్ పూర్తి చేయాలి.
  • ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు Part-II అప్లికేషన్ సమర్పించాలి.
  • దరఖాస్తుల ప్రారంభ, ముగింపు తేదీలను త్వరలో ప్రకటించనున్నారు.

ముఖ్యాంశాలు

  • మొత్తం 275 పోస్టులు
  • డిగ్రీ అర్హత
  • SI ప్రారంభ జీతం ₹42,300
  • ఆన్‌లైన్ దరఖాస్తులు
  • ప్రిలిమ్స్, PET/PMT, ఫైనల్ పరీక్షల ద్వారా ఎంపిక
  • దరఖాస్తు తేదీలు త్వరలో ప్రకటింపు

వెబ్సైట్ : https://www.tgprb.in/

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →