Police jobs exam dates – తెలంగాణ పోలీస్ ఉద్యోగాల పరీక్ష తేదీలు ఖరారు

Telangana police jobs exam dates

BIKKI NEWS (SEP. 17) : Telangana Police jobs exam dates. తెలంగాణలో ఎస్‌ఐ (SI), కానిస్టేబుల్ (PC) ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రిలిమినరీ రాత పరీక్షల (PWT) ప్రాథమిక తేదీలను తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB) అధికారికంగా ప్రకటించింది. బోర్డు విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఎస్‌ఐ ప్రిలిమ్స్ పరీక్షను 2026 నవంబర్ 29న, కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్షను 2026 డిసెంబర్ 20న నిర్వహించనున్నారు.

Telangana Police jobs exam dates

ముఖ్యమైన వివరాలు:

  • మొత్తం ఖాళీలు: 7,437 పోస్టులు (పోలీస్, SPF, ఫైర్ సర్వీసెస్, జైళ్ల శాఖల్లో)
  • దరఖాస్తుల సంఖ్య: 4,29,000 మంది అభ్యర్థుల నుంచి మొత్తం 5,77,064 దరఖాస్తులు అందాయి.
  • ఎస్‌ఐ సివిల్ / తత్సమాన పోస్టులు: 1,60,756 దరఖాస్తులు
  • కానిస్టేబుల్ సివిల్ / తత్సమాన పోస్టులు: 3,89,356 దరఖాస్తులు

పరీక్షల షెడ్యూల్:

  • ఎస్‌ఐ ప్రిలిమినరీ పరీక్ష (SI PWT): 2026 నవంబర్ 29 (ఆదివారం ఉదయం) పూర్వ 10 ఉమ్మడి జిల్లాల కేంద్రాల్లో జరుగుతుంది.
  • కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష (PC PWT): 2026 డిసెంబర్ 20 (ఆదివారం ఉదయం) పూర్వ 10 జిల్లా కేంద్రాలతో కలిపి దాదాపు 15 నుంచి 18 ప్రాంతాల్లో నిర్వహించనున్నారు.
  • టెక్నికల్ పోస్టులైన ఏఎస్ఐ ఎఫ్‌పీబీ (ASI FPB), డ్రైవర్, మెకానిక్ విభాగాల అభ్యర్థులకు నేరుగా శారీరక సామర్థ్య పరీక్షలతో (PMT/PET) ఎంపిక ప్రక్రియ ప్రారంభం కానుంది.

ఆధార్ ఫేస్ అథెంటికేషన్ గడువు: దరఖాస్తు సమయంలో సాంకేతిక కారణాలతో ఆధార్ ఫేస్ అథెంటికేషన్ పూర్తి చేయలేకపోయిన 2.6% అభ్యర్థులకు బోర్డు మరో అవకాశం కల్పించింది. సంబంధిత అభ్యర్థులు తమ లాగిన్ ద్వారా 2026 సెప్టెంబర్ 30వ తేదీలోగా ప్రక్రియను పూర్తి చేసి, దరఖాస్తు ఫారమ్ కాపీని డౌన్‌లోడ్ చేసుకోవాలని స్పష్టం చేసింది.

అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ www.tgprb.in ను సందర్శించవచ్చు.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →