Today in history – చరిత్రలో ఈరోజు సెప్టెంబర్ 09

Today in history - చరిత్రలో ఈరోజు సెప్టెంబర్ 09 - bikki news

BIKKI NEWS : Today in history – చరిత్రలో ఈరోజు సెప్టెంబర్ 09.

Today in history September 9th

దినోత్సవం

  • తెలంగాణ భాషా దినోత్సవం.
  • వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డే .

సంఘటనలు

1908 – ఆంధ్రపత్రిక ప్రారంభించబడింది. తెలుగు లెక్కలో కీలక నామ సంవత్సరం బాధ్రపద శుద్ధ చతుర్థి హిందువులకు పండుగ దినమైన వినాయక చవితి నాడు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ఆంధ్రపత్రికను వారపత్రికగా ప్రారంభించారు. ఇది బొంబాయిలోని తత్వవివేచక ముద్రాక్షరశాలలో ముద్రించబడేది. 1914 ఏప్రిల్ 1 నాడు దినపత్రికగా మారింది మద్రాసులో (చెన్నై)

జననాలు

1892: త్రిపురారిభట్ల వీరరాఘవస్వామి, పండితులు, రచయిత. (మ.1981)
1898: కొచ్చెర్లకోట రంగధామరావు, స్పెక్ట్రోస్కోపీ రంగంలో పేరొందిన భౌతిక శాస్త్రవేత్త. (మ.1972)
1914: కాళోజీ నారాయణరావు, తెలుగు కవి, తెలంగాణావాది. (మ.2002) 1934: సోనియా శాంచెజ్, అమెరికన్ కవి
1935: వేదాంతం సత్యనారాయణ శర్మ, కూచిపూడి నృత్య కళాకారుడు, నటుడు. (మ.2012)
1940: రాపాక ఏకాంబరాచార్యులు, తెలుగు రచయిత, అవధాన విద్యాసర్వస్వము గ్రంథకర్త (మ.2020)
1953: సి.హెచ్. మల్లారెడ్డి, 16వ లోక్‌సభలో మల్కాజిగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యుడు.
1953: మంజుల భారతీయ సినీ నటీమణి. (మ.2013)
1957: జయచిత్ర , తెలుగు ,తమిళ చిత్రాల నటి
1961: సీమా ప్రకాశ్ బయోటెక్నాలజీ శాస్త్రవేత్త. టిష్యూకల్చర్‌లో నిపుణురాలు.
1963: లక్ష్మీ. టి, రంగస్థల నటి.
1970: బిజూ మీనన్, మళయాళ, తెలుగు,తమిళ చిత్రాల సహాయ నటుడు , జాతీయ అవార్డ్ గ్రహీత.
1987: తథాగత్ అవతార్ తులసి, పన్నెండేళ్ళకు ఎమ్మెస్సీ పూర్తి చేయడం ద్వారా గిన్నిస్ బుక్ లోకి ఎక్కిన బాలమేధావి.

మరణాలు

1952: వేపా కృష్ణమూర్తి, తెలుగువాడైన ఇంజనీరు. (జ.1910)
1978: జాక్ ఎల్. (లియోనార్డ్) వార్నర్ (ఐషెల్ బామ్), చిత్రాల రారాజు. హాలీవుడ్లో వార్నర్ బ్రదర్స్ ఒకటి. (జ. 2 ఆగష్టు 1892)
1978: బైరాగి , ప్రముఖకవి , కథ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత(జ.1925)
2003: గులాబ్‌రాయ్ రాంచంద్, భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. (జ.1927)

Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →